Mars Transit 2026: ఈ ఏడాది హోలీ పండుగతో ఈ రాశుల కష్టాలు మాయం.. కుజ సంచారం ఈ రాశుల వారికి వరం!

కుజుడు కూడా కాలనుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడు ధైర్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొదలైన వాటికి కారకుడు. మార్చి 3న కుజుడు రాహువు నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. 

Published on: Jan 29, 2026, 13:30:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు జరిగితే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కుజుడు కూడా కాలనుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడు ధైర్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొదలైన వాటికి కారకుడు.

ఈ ఏడాది హోలీ పండగతో ఈ రాశుల కష్టాలు మాయం.. కుజ నక్షత్ర సంచారం (pinterest)
ఈ ఏడాది హోలీ పండగతో ఈ రాశుల కష్టాలు మాయం.. కుజ నక్షత్ర సంచారం (pinterest)

కుజ సంచారం

మార్చి 3న కుజుడు రాహువు నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. హోలీ నాడు ఈ సంచారం చోటు చేసుకోబోతుండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

హోలీ పండుగకు ఈ రాశుల వారి పంట పండినట్లే.. కుజ నక్షత్ర సంచారం ఈ రాశుల వారికి వరం

మార్చి 3, హోలీ నాడు కుజుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ఊహించని మార్పులను చూస్తారు. అనేక విధాలుగా ఈ రాశుల వారికి కలిసి రాబోతోంది. తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.

1.మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులను చూస్తారు. పాత ఆస్తి సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి కుజ నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. తెలివితేటలు, ధైర్యం కూడా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు కలుగుతాయి.

3.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి.

4.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏదైనా భూమి లేదా భవనాలను కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన సమయం. హోలీతో ఈ రాశి వారి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

5.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. హోలీతో ఈ రాశి వారు అనుకున్న కలలు పూర్తి అవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More