అభిజిత్ నక్షత్రంలోకి కుజుడు, నాలుగు రాశుల వారి కష్టాలు తొలగిపోతాయి.. డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో లాభాలు!
కుజుడు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. కుజుడు అభిజిత్ నక్షత్రంలోకి వచ్చాడు. ఇది 28వ నక్షత్రం. ఈ నక్షత్రంలో కుజ సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రాశుల వారైతే విపరీతమైన లాభాలను పొందుతారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు ఇది శుభ ఫలితాలను అందిస్తే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను తీసుకొస్తుంది. కుజుడు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.

కుజుడు అభిజిత్ నక్షత్రంలోకి వచ్చాడు. ఇది 28వ నక్షత్రం. ఈ నక్షత్రంలో కుజ సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రాశుల వారైతే విపరీతమైన లాభాలను పొందుతారు.
అభిజిత్ నక్షత్రంలో కుజుడు
జనవరి 24 సాయంత్రం 6:17 నుంచి జనవరి 30 ఉదయం 4:03 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. మరి ఏ రాశుల వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుందో, వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
అభిజిత్ నక్షత్రంలోకి కుజుడు.. నాలుగు రాశుల వారు ధనవంతులు అయ్యే అవకాశం
1.మేష రాశి
మేష రాశి వారికి అభిజిత్ నక్షత్రంలో కుజ సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పని ప్రదేశంలో కూడా మంచి మార్పులను చూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరంగా మరింత బలపడతారు.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పని ప్రదేశంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా సానుకూల మార్పులను చూస్తారు. మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది.
4.మీన రాశి
మీన రాశి వారికి అభిజిత్ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


