తిరుమల : ఈనెల 15న 'మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్' - ఈ కార్యక్రమాలన్నీ మీకోసమే
మహాశివరాత్రి వేళ టీటీడీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వైభవమ్ కార్యక్రమం నిర్వహించనుంది.సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా హాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను నిర్వహించనున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో ఈ కార్యక్రమం ఉండనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

నిర్విరామంగా కార్యక్రమాలు…
మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 06 గం.ల నుంచి అర్థరాత్రి 12 గం.ల వరకు నిర్విరామంగా నిర్వహిస్తారు. ఇందులో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా హెచ్ డి పి పి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పూర్వ కాలంలో మహాశివరాత్రి సందర్భంగా సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో భాగంగా భక్తులు ఆలయాలకు చేరుకుని రాత్రంతా భజనలు, హరికథలు తదితర భక్తి కార్యక్రమాలతో జాగరణ చేసేవారు. ప్రస్తుతం అదే పంథాలో భక్తులను సంప్రదాయ పద్దతిలో భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలోని సదరు కేంద్రాలలో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులందరూ విచ్చేసి పరమ శివుని అనుగ్రహం పొందాలని కోరడమైనది. లింగోద్భవ సమయానంతరం భక్తాదులకందరికి ప్రసాద వితరణ చేయనున్నారు.
- తిరుపతి మహతి క్షేత్రంలో ఎం. సరళ బృందంతో శివస్తోత్ర పారాయణం, జి. ప్రభాకర్ శర్మతో పురాణ ప్రవచనం ఉంటుంది. సి. హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆద్వర్యంలో శివ భజనామృతం చేపడుతారు.
- కపిలతీర్థంలో వి. ప్రసన్న లక్ష్మీ బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం, ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, సి. హెచ్. జగదీష్ ఆద్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం ఉంటుంది. వై. వేంకటేశ్వర్లు నేతృత్వంలో సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు.
- అన్నమాచార్య కళామందిరంలో జి. ఇందిరారాణి బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం, వి. నిర్మలా బాయ్ తో పురాణ ప్రవచనం ఉంటుంది. సి.హెచ్. అజయ్ కుమార్ బృందంతో పార్వతి పరిణయం నృత్య రూపకం, జె. కృష్ణ కుమారి ఆధ్వర్యంలో పార్వతి పరిణయం హరికథ నిర్వహిస్తారు. సంప్రదాయ పాఠశాల విద్యార్థినులతో శివ భజనామృతం కార్యక్రమాలను చేపడుతారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











