మహాశివరాత్రి 2026: శివరాత్రి నాడు మీ రాశి ప్రకారం వీటిని సమర్పిస్తే శివయ్య ఆశీస్సులతో కోరికలు తీరుతాయి!

మహాశివరాత్రి చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంవత్సరంలో ప్రధాన పండుగలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు దీనిని జరుపుకుంటారు. శివ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. 

Published on: Feb 7, 2026, 10:01:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ మతంలో మహాశివరాత్రి చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంవత్సరంలో ప్రధాన పండుగలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు దీనిని జరుపుకుంటారు. శివ భక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి.

మహాశివరాత్రి 2026: శివరాత్రి నాడు మీ రాశి ప్రకారం వీటిని సమర్పిస్తే మంచిది
మహాశివరాత్రి 2026: శివరాత్రి నాడు మీ రాశి ప్రకారం వీటిని సమర్పిస్తే మంచిది

ఆ రోజున శివుడు, పార్వతీ దేవిని మనస్ఫూర్తిగా పూజిస్తే ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. మరో వైపు, రాశిచక్రం ప్రకారం ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే శివుడు సంతోషిస్తాడని, శివుని అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో అన్ని పనులు పూర్తవుతాయి, క్రమంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రి నాడు శివుడికి ఏ రాశి వారు ఏ వస్తువులను సమర్పించాలో తెలుసుకుందాం

మహాశివరాత్రి వేళ శివుడికి వీటిని సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి

మేష రాశి: మేష రాశి వారు శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా శివుని అనుగ్రహం కలుగుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈ రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా వృషభ రాశి వారి పనులన్నీ పూర్తవుతాయి.

మిథున రాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి పెరుగు సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా మిథున రాశి వారి ప్రతి కోరిక నెరవేరుతుంది.

కర్కాటక రాశి: మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధపు పరిమళ ద్రవ్యాలను సమర్పించాలి. ఇది శివుడిని సంతోషపరుస్తుంది.

సింహ రాశి: మహాశివరాత్రి రోజున శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శివ దేవుని అనుగ్రహం కలుగుతుంది.

కన్యా రాశి: రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పూజించి, నీటితో పాటు నల్ల నువ్వులను సమర్పించాలి. ఇది కన్యా రాశి వారి అన్ని ఇబ్బందులను తొలగిస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు శివలింగానికి గంధాన్ని సమర్పించాలి. దీని వల్ల తులా రాశి వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. వారి పనులన్నీ పూర్తవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి నాడు శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి. దీనితో శివుడు వారి ప్రతి కోరికను తీరుస్తాడు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ మహాశివరాత్రి రోజున శివలింగానికి నీరు, బియ్యం సమర్పించాలి. శివుని దయతో ధనుస్సు రాశి వారి అన్ని చింతలు తొలగిపోతాయి.

మకర రాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున పేదలకు దానం చేయాలి. దీని ద్వారా శివయ్య అనుగ్రహం కలుగుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. శివుని ఆశీస్సులు ఏడాది పొడవునా ఉంటాయి.

మీన రాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. శివుని దయతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగి పోతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More