...
...
Next Story

వైసీపీ రెచ్చగొడుతోంది.. సైలెంట్‌గా ఉండండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఊరుకోం : చంద్రబాబు

శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

Published on: Feb 02, 2026 03:12 PM IST
Advertisement

శాంతిభద్రతలను కాపాడటం అత్యంత ముఖ్యమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరులో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడులు జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

శాంతిభద్రతల పరిరక్షణ చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలను సహించబోమని చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జోగి రమేష్ ఇంటి దగ్గర నిరసనలు జరగడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 189 (2), 190, 292, 324 (4) కింద ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 66/2026) నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ ఇంటికి పలువురు నిప్పు అంటించారు.

ఈ ఘటనలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. చట్టబద్ధమైన పాలన అన్ని సమయాల్లో కొనసాగాలని అన్నారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య, రాజ్యాంగ మార్గాల ద్వారా మాత్రమే వ్యక్తీకరించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe