టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీకి కారణాలేంటి? చంద్రబాబు ఏమన్నారు?

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరుమలలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సింఘాల్ బదిలీపై చంద్రబాబు ఏమన్నారు?

Published on: Feb 1, 2026, 19:56:58 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ వైపు తిరుపతి లడ్డూలో కల్తీ వివాదం తీవ్రంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026న టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్రను టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు. ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ

కల్తీ నెయ్యి సరఫరా కావడానికి గత ప్రభుత్వం హయాంలో నెయ్యి సేకరణ విధానం కారణమని గుర్తించారని ప్రచారం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని అనుమానాలు వచ్చినప్పుడు సింఘాల్ టీటీడీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్నారు. నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. సింఘాల్ ఈ సమస్యను సకాలంలో గుర్తించడంలో విఫలమయ్యారని భావించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం బహిరంగమైన తర్వాత కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న వారిపై అవసరమైన చర్యల గురించి కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ప్రత్యేక దృష్టి ఉంటుందని అంటున్నారు. సింఘాల్ బదిలీ నిర్ణయం తిరుమల పరిపాలన, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సింఘాల్‌ గతంలో 2017 మే6 నుంచి 2020 అక్టోబర్‌ 4 వరకు టీటీడీ ఈవోగా చేసిన విషయం తెలిసిందే. కేంద్ర సర్వీస్‌లో ఉన్న సింఘాల్‌కు టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం వచ్చింది. 2025 సెప్టెంబర్‌లో ఈవోగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. తాజాగా బదిలీ అయ్యారు.

చంద్రబాబు ఏమన్నారంటే?

టీటీడీకి కల్తీ నెయ్యి ఘటనపై మెుదటి నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. తాజాగా టీటీడీ ఈవో నుంచి అనిల్ కుమార్ సింఘాల్ బదిలీపై మాట్లాడారు. అనిల్ కుమార్ సింఘాల్ బదిలీపై ఇప్పుడు మాట్లాడను అని ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ విషయంపై మరింత ఆసక్తి నెలకొంది. తిరుమల పవిత్రమైన ప్రాంతమని, తాము వచ్చిన వెంటనే పవిత్రతను కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ప్రక్షాళనలో భాగంగానే శ్యామలరావును పంపినట్టుగా చెప్పారు. అప్పుడే శ్యామలరావు ఎన్‌డీడీబీ నివేదిక అడిగినట్టుగా వెల్లడించారు.

కల్తీ నెయ్యి ఘటనపై ఎన్‌డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడానని తెలిపారు సీఎం. జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానన్నారు. కల్తీ నెయ్యి ఘటనలో దర్యాప్తు కోసం సిట్ వేశామన్నారు. శ్రీవారు తాను నమ్మే దేవుడని, వెంకటేశ్వరస్వామి దగ్గర నేను సామాన్య భక్తుడినని చెప్పారు. శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారన్నారు. తిరుమలలో మహాపాపం చేశారని, అపచారం చేశారని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More