...
...
Next Story

కూకట్‌పల్లిలో తీవ్ర అగ్నిప్రమాదం - గోడౌన్లకు వ్యాపించిన మంటలు, వాహనాలు దగ్ధం!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్బెస్టాస్ కాలనీలో పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం కాలిపోయాయి.

Published on: Nov 9, 2026, 12:03:32 IST
Advertisement

హైదరాబాద్‌ నగర పరిధిలోని కూకట్‌పల్లిలో శనివారం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పీఎస్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఉన్న ఒక పారిశ్రామిక ప్రాంతంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే అగ్నికీలలు పక్కనే ఉన్న పరిశ్రమలకు, గోదాములకు వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది.

అగ్నిప్రమాదం
అగ్నిప్రమాదం

ఆస్బెస్టాస్ కాలనీలోని ఒక పేపర్ కప్పుల తయారీ యూనిట్‌లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. కాగితపు వ్యర్థాలు, ఇతర దహనశీల పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా పక్కనే ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థల గోదాములకు దట్టంగా అల్లుకున్నాయి. పక్కనే ఉన్న జీఆర్‌టీ నెయ్యి గోదాము, హల్దీరామ్స్ కంపెనీలకు చెందిన గోదాములకు మంటలు వ్యాపించడంతో నష్టం తీవ్ర రూపం దాల్చింది.

ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 3 పారిశ్రామిక యూనిట్లు తీవ్రంగా దెబ్బతిని కాలి బూడిదయ్యాయి. కేవలం గోదాములు, పరిశ్రమల భవనాలే కాకుండా అక్కడ నిలిపి ఉంచిన రవాణా వాహనాలు కూడా నిప్పుల రొంపిలో చిక్కుకున్నాయి. ప్రాంగణంలో ఉన్న 5 ఆటోలు, ఒక డీసీఎం సరుకుల వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతై భస్మీపటలమయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. పలు ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. అటు హైడ్రా (HYDRAA) విపత్తు నిర్వహణ బృందాలు కూడా వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శ్రమించి మంటలు పరిసర నివాస ప్రాంతాలకు విస్తరించకుండా అదుపు చేయగలిగారు.

షార్ట్ సర్క్యూటే కారణామా..?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks