కృష్ణా అలా కాదు.. ఇలా ఉరేసుకో.. భార్య సూసైడ్ చేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఉరి వేసుకుండంగా.. భర్త వీడియో తీశాడు. అంతేకాదు ఇలా ఉరి వేసుకోవాలని సలహాలు ఇచ్చాడు.
భర్త కళ్లెదుటే భార్య ఉరివేసుకుంది. అయితే కాపాడాల్సిన భర్త ఈ ఘటనను వీడియో తీశాడు. అంతేకాకుండా ఉరివేసుకుంటుండగా సలహాలు ఇచ్చాడు. నవ్వుతూ ఉన్నాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

కడప జిల్లా రాజంపేటలో పోలీసులు శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఆమెను ఆపాల్సింది పోయి.. ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించినందుకు గాను పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజంపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లికి చెందిన లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాస్, తన భార్య కృష్ణవేణితో తరచుగా గొడవపడేవాడు. నిజానికి ఒంగోలుకు చెందిన శ్రీనివాస్ మెుదటి భార్య పది సంవత్సరాల కిందట చనిపోయింది. ఈ కారణంగా 2016లో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
శ్రీనివాస్ మద్యం అలవాటు కారణంగా ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో కృష్ణవేణి చనిపోతా అంటూ కొన్ని రోజులుగా అంటోంది. అయితే ఇటీవల గొడవలు మళ్లీ ఎక్కువ అయ్యాయి. తాజాగా చనిపోతానని ఇంట్లో గడియపెట్టుకుంది. భర్త శ్రీనివాస్ తలుపుల బయట ఉన్నాడు. ఈ సమయంలో కృష్ణవేణి ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తుంది. బయటే ఉన్న భర్త వీడియో తీశాడు. తన భార్య బెదిరిస్తుందని భావించాడు. కృష్ణా సరిగా ఉరెసుకో.. అలా కాదు.. ఇలా అంటూ సలహాలు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఆమె మెడకు ఉచ్చు బిగుసుకుంది. తలుపు తీసేందుకు శ్రీనివాస్ ప్రయత్నించినా ఫలితం లేదు. అరుపులు విని పక్కవారు వచ్చారు. అప్పటికే కృష్ణవేణి చనిపోయింది. భార్య ఉరి వేసుకుంటుంటండగా భర్త వీడియో తీశాడు.
'కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించడం మానేసి, ఆమె భర్త ఆ సంఘటన మొత్తాన్ని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.' అని మన్నూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లింగప్ప తెలిపారు.
ఘటనా స్థలానికి హుటాహుటిన కృష్ణవేణి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు శ్రీనివాస్‌పై దాడి చేసి, అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, శ్రీనివాస్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


