...
...
Next Story

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ - ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్‌ మృతి

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సింహాచలం అలియాస్‌ సుధాకర్‌ మృతి చెందారు.

Published on: Jun 05, 2025 04:32 PM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఎన్ కౌంటర్ లో పార్టీ అగ్రనేత సుధాకర్‌(అలియాస్ సింహాచలం) మృతి చెందాడు. కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న సుధాకర్ పై రూ.50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.

ఉదయం నుంచి కాల్పులు…!

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల క్యాడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాల ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు, ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో సింహాచలం(65) ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

గత 40 ఏళ్లుగా మావోయిస్టుఉద్యమంలో సుధాకర్ ఉన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నారు. కీలక నేతల మృతితో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఇటీవలే కేశవురావు మృతి:

ఇటీవలనే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌ సరిహద్దులో.. మే 21న భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ అలియాస్‌ బీఆర్‌ దాదా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతి పెద్ద సంచలనంగా మారింది.

నంబాల కేశవరావుఅలియాస్ బసవరాజు, క్రిష్ణ, వినయ్, బసవర రాజు, ప్రకాష్ ఇలా చాలా మారుపేర్లతో ఉద్యమాన్ని నడిపారు. 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా అనంతరం కేశవరావు మావోయిస్టు సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం.

దేశవ్యాప్తంగా జరిగిన అనేక కీలక దాడుల్లో బసవరాజు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అయితే నంబాల సమాచారం పక్కాగా తెలుసుకున్న భద్రతా దళాలు… వ్యూహాత్మకంగానే మట్టుబెట్టాయి. ఆయన పార్థివదేహాన్ని కూడా కుటంబ సభ్యులకు ఇవ్వలేదు. ఛత్తీస్ ఘడ్ లోనే అంత్యక్రియలను నిర్వహించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe