Visakha CII Summit : మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ భారీగా పెట్టుబడులు.. 24 ఒప్పందాలు

Visakhapatnam CII Summit : విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా యువతకు 75,055 ఉద్యోగావకాశాలు రానున్నాయి.

Published on: Nov 13, 2026, 17:04:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విశాఖలో జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు రెండోరోజు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో 24 కంపెనీలు రూ.1,05,634 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర యువతకు 75,055 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

మంత్రి నారా లోకేశ్ ఒప్పందాలు
మంత్రి నారా లోకేశ్ ఒప్పందాలు

ఏరో స్పేస్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఎఎం ఎఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డాటా సెంటర్, పంచశీల్ రియాల్టీ - రూ.37,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయూలు, జీఓ ఎక్స్చేంజీల వివరాలు ఇలా ఉన్నాయి.

రెండోరోజు ఒప్పందాల వివరాలు

1. SALVO ఇండస్ట్రీస్ – రూ.800 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు

2. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ – రూ.550 కోట్ల పెట్టుబడి – 565 ఉద్యోగాలు

3. ఐజీ డిఫెన్స్ – రూ.500 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు

4. ఆర్చియన్ గ్రూప్ – రూ.2,000 కోట్ల పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు

5. కెయిన్స్ టెక్నాలజీ ఇండియా – రూ.3,145 కోట్ల పెట్టుబడి – 2,000 ఉద్యోగాలు

6. ఎఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్ – రూ.450 కోట్ల పెట్టుబడి – 7,000 ఉద్యోగాలు

7. పంచషిల్ రియాల్టీ (హైపర్ స్కేల్ డాటా సెంటర్) – రూ.37,000 కోట్ల పెట్టుబడి – 32,000 ఉద్యోగాలు

8. వారీ ఎనర్జీస్ – రూ.10,000 కోట్ల పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు

9. క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ – రూ.8,000 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు

10. ఈపాక్ డేటా సెంటర్ సొల్యూషన్స్ – రూ.570 కోట్ల పెట్టుబడి – 2,565 ఉద్యోగాలు

11. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ – రూ.10 కోట్ల పెట్టుబడి – 100 ఉద్యోగాలు

12. హొరిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ఎంఓయు

13. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) – క్లైమేట్ రెస్మాన్స్ అర్బన్ ప్లానింగ్, అమరావతి ఎంఓయు.

14. సముద్ర సూర్య LLC – రూ.100 కోట్ల పెట్టుబడి – 50 ఉద్యోగాలు

15. పీవీఎస్ రామ్మోహన్ హెల్త్ కేర్ – రూ.312 కోట్ల పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు

16. సబ్ స్టేట్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా – రూ.931 కోట్ల పెట్టుబడి – 4,000 ఉద్యోగాలు

17. ఇన్ఫినిటీ – రూ.250 కోట్ల పెట్టుబడి – 1,100 ఉద్యోగాలు

18. సైయింట్ DLM & హిందుస్థాన్ షిప్ యార్డ్ – రూ.1,000 కోట్ల పెట్టుబడి

19. ఎఎం ఎఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 31,387 కోట్ల పెట్టుబడి – 1000 ఉద్యోగాలు

20. కిమ్స్ హాస్పటల్స్ – 1,500 కోట్ల పెట్టుబడి – 2000 ఉద్యోగాలు

21. యోధ హెల్త్ కేర్ & హాస్పటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 1,359 కోట్ల పెట్టుబడి – 4,925 ఉద్యోగాలు

22. పవన్ హాన్స్ హెలీ పోర్ట్స్ అభివృద్ధికి ఎంఓయు

23. స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎపి స్పోర్ట్స్ విలేజ్) – రూ.4,270 కోట్ల పెట్టుబడి – 8,000 ఉద్యోగాలు

24. స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎపి డిస్ట్సిక్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ & ఎరినా) – రూ.1,500 కోట్ల పెట్టుబడి – 3,000 ఉద్యోగాలు

ఇంటికో పారిశ్రామికవేత్త ఏపీ లక్ష్యం

ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్ఛేంజ్(APEX) కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన 6 ప్రతిభావంతమైన స్టార్టప్‌ల నిర్వాహకులను అభినందించి, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన 31 స్టార్టప్‌లకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందించారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన అప్రూవల్ లెటర్స్, చెక్కులను ఆయా స్టార్టప్ సంస్థలకు అందజేశారు.

'రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్ వంటి సంప్రదాయ రంగాల నుంచి క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల వరకు ఈ ఎకోసిస్టమ్‌లను నిర్మిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు అక్కడ ఎన్నో అద్భుతమైన విజయగాథలు విన్నాను. అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన విడిభాగాల తయారీ వైపు కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను మలచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఏపీలో క్వాంటం ఎకోసిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం.' అని మంత్రి లోకేశ్ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More