విశాఖ సీఐఐ సమ్మిట్‌.. తొలిరోజు రూ. 1,57,607 కోట్ల పెట్టుబడులు.. 52,956 ఉద్యోగాలు!

విశాఖ సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాల జరిగాయి. రూ. 1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి.

Published on: Nov 12, 2026, 18:30:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 30 ఎంఓయులు, 5 జీఓల ద్వారా రూ. 1,57,607 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 52,956 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంఓయూలు
మంత్రి లోకేశ్ సమక్షంలో ఎంఓయూలు

రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఏరో స్పేస్, హెల్త్ కేర్, టూరిజం రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ 3 ఎంఓయుల ద్వారా రూ.39,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 12,940 ఉద్యోగావకాశాలు రానున్నాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్లు, క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.41వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలికం లిమిటెడ్ రూ.9,053 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయూలు, జీఓ ఎక్స్చేంజీల వివరాలు చూడండి

ఒప్పందాల వివరాలు

రష్మీ మెటలర్జికల్ – రూ.18,500 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు

రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ – రూ.8,500 కోట్లు పెట్టుబడి – 800 ఉద్యోగాలు

రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ – 42 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు

N.A.N మాగ్నెటెక్ – 3,000 కోట్లు పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

N.A.N సెలాక్స్ గ్రీన్‌మెట్ – 1,800 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు

వెల్సపన్ గ్రూప్ – 2,500 కోట్లు పెట్టుబడి – 3,500 ఉద్యోగాలు

ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ – 2,350 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా – 2,300 కోట్లు పెట్టుబడి – 1,500 ఉద్యోగాలు

MEIL-ఎక్విప్‌మెంట్ స్కిడ్స్ – 1,100 కోట్లు పెట్టుబడి – 2,500 ఉద్యోగాలు

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా – 36,000 కోట్లు పెట్టుబడి - 8940 ఉద్యోగాలు

హీరో మోటర్ కార్ప్ – 1,457 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు

పిఫైజర్ హెల్త్ కేర్ – రూ.983 కోట్లు పెట్టుబడి – 150 ఉద్యోగాలు

బ్లూజెట్ హెల్త్ కేర్ – 500 కోట్లు పెట్టుబడి – 1,000 ఉద్యోగాలు

ట్రైఫోస్ పవర్ – రూ.500 కోట్లు పెట్టుబడి – 200 ఉద్యోగాలు

రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 300 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు

రఘు వంశీ ఎయిరోస్పేస్ గ్రూప్ – 250 కోట్లు పెట్టుబడి – 300 ఉద్యోగాలు

సిటోటో డిజిటల్ పర్సనాలిటీ – 250 కోట్లు పెట్టుబడి - 230 ఉద్యోగాలు

ప్రీమియర్ ఎనర్జీస్ – 100 కోట్లు పెట్టుబడి - 75 ఉద్యోగాలు

డెల్టాక్స్ – 42 కోట్లు పెట్టుబడి - 110 ఉద్యోగాలు

క్లీన్ మాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ – 41,000 కోట్లు పెట్టుబడి - 600 ఉద్యోగాలు

రేస్ పవర్ – 9,660 కోట్లు పెట్టుబడి – 500 ఉద్యోగాలు

రేస్ ఫ్యూయల్స్ – 3,000 కోట్లు పెట్టుబడి - 80 ఉద్యోగాలు

యునైటెడ్ టెలికామ్స్ – 9,053 కోట్లు పెట్టుబడి – 1,200 ఉద్యోగాలు

MNL సొల్యూషన్స్ – 750 కోట్లు పెట్టుబడి - 500 ఉద్యోగాలు

క్లారస్ ఎనర్జీ – 100 కోట్లు పెట్టుబడి - 50 ఉద్యోగాలు

ఫ్యాబ్రిక్ – 4,300 కోట్లు పెట్టుబడి – 10,000 ఉద్యోగాలు

SLN కాఫీ – 2,500 కోట్లు పెట్టుబడి – 1,400 ఉద్యోగాలు

మానే గ్లోబల్ – 120 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

డీఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ – 140 కోట్లు పెట్టుబడి - 140 ఉద్యోగాలు

ది పార్క్ హోటల్ – 115 కోట్లు పెట్టుబడి - 150 ఉద్యోగాలు

జీఓ ఎక్సేంజ్ ద్వారా ఒప్పందాలు

ఎం వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ – 3,078 కోట్లు పెట్టుబడి – 1,300 ఉద్యోగాలు

జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్స్ – 1,533 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

ఓషిఆర్ గ్రీన్ ఫ్యుయిల్స్ – 616 కోట్లు పెట్టుబడి - 130 ఉద్యోగాలు

రెసల్వెన్ టూ ఎనర్జీ – 980 కోట్లు పెట్టుబడి - 250 ఉద్యోగాలు

గ్రాండ్ తిరుపతి హోటల్స్ అండ్ రిసోర్ట్స్ – 188 కోట్లు పెట్టుబడి – 851 ఉద్యోగాలు

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More