సికింద్రాబాద్, విశాఖ, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్ల వివరాలు ఇవే!

పండుగ సీజన్ కారణంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్స్ విశాఖ, తిరుపతి, సికింద్రాబాద్ మధ్య ఉన్నాయి.

Published on: Oct 22, 2026, 09:51:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ - తిరుపతి, విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, వేళలు, ఆగే స్టేషన్ల పూర్తి వివరాలు చూడండి.

దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్

సికింద్రాబాద్–తిరుపతి

07424(సికింద్రాబాద్ నుండి తిరుపతి) స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 22, 2026 సికింద్రాబాద్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ అందుబాటులో ఉంటాయి.

విశాఖపట్నం – సికింద్రాబాద్

విశాఖపట్నం, సికింద్రాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం రెండు వైపులా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నం – సికింద్రాబాద్ స్పెషల్ (Train No. 08517) అక్టోబర్ 22, అక్టోబర్ 25, 2026 తేదీల్లో నడుస్తాయి. విశాఖపట్నంలో మధ్యాహ్నం మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్ (Train No. 08518) అక్టోబర్ 23, అక్టోబర్ 26 తేదీల్లో ఉంటాయి. సికింద్రాబాద్‌లో రాత్రి రాత్రి 8 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఆగే స్టేషన్లు వివరాలు చూస్తే.. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో నిలుస్తాయి. ఈ రైళ్లలో కూడా 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

పండుగ వేళ స్వగ్రామాలకు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. ప్రయాణికులు రైల్వే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా స్టేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More