రోగి ఇంటి వద్దకే వైద్య సేవలు.. హెల్త్ ఇన్సూరెన్స్ తెస్తున్నాం : చంద్రబాబు
రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో దేశానికి ఏపీ రోల్ మోడల్‌గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంత ఆస్తి ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదన్నారు.
గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రత్యేకతలను నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజివనీ ప్రాజెక్టు పని చేయనుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

ఏపీలోని 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ రోల్ మోడల్‌గా ఉంటుందన్నారు. ఆస్తులు ఎన్ని ఉన్నా.. మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని స్పష్టం చేశారు. అనారోగ్యమే నిజమైన పేదరికం అని చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో శంకర ఐ ఆసుపత్రి కృషిని అభినందించారు.
'మన దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కంచి పీఠం లాంటి ఆధ్యాత్మిక సంస్థలు కారణం. శంకర ఆసుపత్రి విభాగంలో ఐ కేర్ విభాగాన్ని ప్రారంభించడం నా అదృష్టం. శంకర ఆసుపత్రి 50 ఏళ్ల వేడుకకు సైతం హాజరవుతాను. రోజుకు 750 మందికి ఉచితంగా నేత్ర పరమైన వైద్య సేవలు అందించడం అరుదైన విషయం.' అని చంద్రబాబు అన్నారు.
నేపాల్, కాంబోడియా, నైజీరియాలో సైతం శంకర ఐ ఆసుపత్రులు ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కంచి పీఠం పిలుపునిస్తే.. అనేక మంది దాతలు స్పందిస్తారని, రెయిన్‌బో కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టారన్నారు. ఇప్పటి వరకు 32 వేల వైద్య శిబిరాలు నిర్వహించి.. సుమారు 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆర్థిక పరమైన లక్ష్యాలతో కాకుండా ఆధ్యాత్మిక సేవా లక్ష్యంతో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని చెప్పారు.
'పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే నా లక్ష్యం. ఏపీలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ వర్తించేలా 2,50,000 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురానున్నాం. సంజీవని పథకంతో ఇంటి దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.' అని చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


