Rajamahendravaram Accident : రాజమహేంద్రవరం కారు ప్రమాద ఘటన - వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు… తీవ్ర సంతాపం తెలిపారు.

Published on: Aug 10, 2026, 07:48:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం…

రాజమహేంద్రవరంలోని ఒక షాపింగ్ మాల్ బయట గురువారం రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పీజీ మెడికల్ విద్యార్థులైన ప్రియాంక, ఉమేష్‌ ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఒక కారు వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రమైన గాయం కాగా…. ఉమేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకను స్థానిక రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం, తదుపరి నిర్వహణ కోసం ఆగస్టు 6న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.32 గంటలకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అత్యంత విషాదం - సీఎం చంద్రబాబు

ఈ విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా స్పందించారు. "వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం నన్ను ఎంతగానో కలచివేసింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ యువకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, ఎంతో ఆశాజనకమైన భవిష్యత్తు ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి చేతనైన అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రమాదానికి కారణమైన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించారని సీఎం వెల్లడించారు. తాగుబోతుల నిర్లక్ష్యానికి అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని, ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారికి తగిన కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More