పట్టిసీమ ద్వారా కృష్టా డెల్టాకు గోదావరి జలాలు తరలిస్తున్నాం - సీఎం చంద్రబాబు
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పంటలకు గోదావరి జలాలను సమృద్ధిగా అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి తన నివాసానికి వెళ్తుండగా…. బ్యారేజీ వద్ద కాన్వాయ్‌ను కొద్దిసేపు ఆపారు. బ్యారేజీపై నిలబడి నదిలో నీటి మట్టాన్ని, ప్రవాహ వేగాన్ని ఆయనే స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీటి వివరాలను, డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని ముఖ్యమంత్రికి వివరంగా అందించారు.

పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ….
ఈ వర్షాకాల సీజన్‌లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి విజయవంతంగా తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహాలు వస్తున్నాయని….. అందువల్ల ఇప్పటివరకు 521 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లి కలిసిందని తెలిపారు.
గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి సమృద్ధిగా చేరుతుండటంతో కృష్ణా డెల్టాలోని వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బ్యారేజీ దిగువన ఉన్న వివిధ ప్రధాన కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీటిని నిరంతరాయంగా విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
డెల్టా ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీటి పరిమాణాన్ని అధికారులు క్రమబద్ధీకరించారు.
- కృష్ణా తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,928 క్యూసెక్కుల నీటిని వదిలారు.
- కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ ద్వారా 3,115 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- గుంటూరు ఛానల్ ద్వారా 115 క్యూసెక్కుల నీటిని పంపించారు.
మొత్తంగా కృష్ణా డెల్టా పరిధిలోని పంటల సాగు నీటి అవసరాల కోసం అన్ని ప్రధాన కాలువల ద్వారా కలిపి 7,158 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి జలాలు తోడవ్వడంతో ఈ ఏడాది డెల్టా రైతన్నలకు సాగునీటి కొరత ఉండదని అధికారులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

