ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో కూటమి ప్రభుత్వం వెనకపడింది : వైఎస్ జగన్
MGNREGA : ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలుపై కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు మీద వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలు బలహీనపడిందని ఆరోపించారు. ఈ మందగమనం గ్రామీణ కార్మికులకు ఉపాధి, వేతనాలను తగ్గించిందని ఆయన అన్నారు.

'ఈ పథకం గ్రామీణ కుటుంబాల వద్ద ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచి, వినియోగాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలలో ఒకటిగా ఉండేది. కానీ ఇటీవలి పోకడలు మందగమనాన్ని సూచిస్తున్నాయి.' అని జగన్ అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దృక్కోణం నుండి, MGNREGA సమర్థవంతమైన అమలు అత్యంత కీలకమని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ వర్గాలలో ఆదాయాలను పెంచుతుందన్నారు వైఎస్ జగన్.
ఎంజీఎన్ఆర్ఈజీఏ గణాంకాలను పోస్ట్ చేసిన జగన్.. గత రెండేళ్లలో ఆమోదిత బడ్జెట్, సృష్టించిన పనిదినాలు, 100 రోజుల పనిని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య, మొత్తం వ్యయం అన్నీ తగ్గాయని అన్నారు. ఈ తగ్గుదల, తక్కువ ఉపాధి అవకాశాలను, గ్రామీణ కార్మికులకు తక్కువ వేతనాలను ప్రతిబింబిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి మందగించడం కొనుగోలు శక్తి క్షీణించడాన్ని, డిమాండ్ బలహీనపడటాన్ని సూచిస్తోందని జగన్ అన్నారు. ప్రభుత్వం అవినీతితో సతమతమవుతూ ప్రజా సమస్యలపై దృష్టి కోల్పోయిందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలను నిరంతరం నిర్లక్ష్యం చేయడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపుతుందని జగన్ పేర్కొన్నారు.
నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అని వైఎస్ జగన్ అన్నారు. దీనితో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఇలాంటి చార్రిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం వెనకపడిపోయిందన్నారు.
'ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే అర్థం అవుతుంది. రెండు సంవత్సరాలలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తక్కువైపోయింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు.' అని వైఎస్ జగన్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


