...
...
Next Story

Andhrapradesh : గ్యాస్ బుకింగ్ సమస్యలా..? 1967 నెంబర్ కు కాల్ చేయండి

నూరు శాతం ఓటీపీ ద్వారానే ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలిపారు. ఏమైనా ఫిర్యాదుల కోసం 1967 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని వివరించారు.

Published on: Apr 1, 2026, 06:07:30 IST
Advertisement

రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్, గ్యాస్ లకు ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి రోజూ సరఫరా, డిమాండ్ పై డీలర్లు, అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు.

ఎల్‌పీజీ సిలిండర్
ఎల్‌పీజీ సిలిండర్

విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వదంతుల వల్ల ఐదు లక్షల బుకింగ్ లు ఒకేసారి జరగడంతో స్వల్ప బ్యాక్ లాగ్ ఏర్పడిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. ప్రస్తుతం 2,70,000 సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడవకముందే సిలిండర్ రీ-బుకింగ్ చేయడం సాధ్యపడదన్నారు.

1967 కాల్ చేయండి - మంత్రి నాదెండ్ల

వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల వివరించారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే కేవలం ఓటీపీ తో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేస్తున్నామన్నారు. ఏమైనా ఫిర్యాదుల కోసం 1967 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు ప్రకటించారు.

  • మంత్రి నాదెండ్ల ప్రకటించిన వివరాల ప్రకారం…… రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగం పెట్రోల్ 7,900 కిలో లీటర్లు, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉంది. ప్రస్తుతం డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్‌ను 2.4% అదనంగా పెంచారు.
  • నాన్-డొమెస్టిక్ (కమర్షియల్) సిలిండర్ల కోటాను కేంద్ర ప్రభుత్వం 10% నుండి 70% కి పెంచింది, దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆసుపత్రులకు మరింత గ్యాస్ అందుబాటులోకి వస్తుంది.
  • బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు చేస్తున్న 146 గ్యాస్ ఏజెన్సీలపై 6A కేసులు నమోదు చేశారు. 4,285 సిలిండర్లను సీజ్ చేయడం చేశారు.
  • గ్యాస్ పైప్ లైన్ అవకాశం ఉన్న ప్రాంతాలలో యల్.పి.జి నుంచి నాచురల్ గ్యాస్ కు మారాలని కోరుతున్నారు. మూడు నెలల్లో లక్ష మంది వినియోగదారులను ఈ న్యాచురల్ గ్యాస్ వైపు తీసుకు వచ్చే విధంగా చేస్తారు. పది లక్షల మందిని ఇటువైపు మళ్లించేలా లక్ష్యంగా పని చేయనున్నారు.
  • విజయవాడ, మచిలీపట్నం మెగా గ్యాస్ డిస్టిబ్యూషన్ , చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురంలో థింక్ గ్యాస్ డిస్టిబ్యూషన్, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ డిస్టిబ్యూషన్, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో భాగ్యనగర్ గ్యాస్ లు అందుబాటులోకి వస్తాయి.
  • కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా కు అనుమతి ఇచ్చింది. పైపు లైన్లు ఏర్పాటు చేయించుకుని…. నేచురల్ గ్యాస్ వైపు వెళ్లే ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నట్లు మంత్రి నాదెండ్ల పిలుపునిచ్చారు.

 
SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks