ఇంట్లో గ్యాస్ సిలెండర్ ఏ దిశలో ఉంటే మంచిది? ఈ తప్పులు చేస్తే చాలా నష్టాలు కలుగుతాయి!

వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, చాలా మంది ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాస్తు ప్రకారం పెడుతూ ఉంటారు. గ్యాస్ సిలిండర్లను కూడా వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రతికూల శక్తి లేకుండా ఉంటుంది.

Published on: Mar 28, 2026, 08:01:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, చాలా మంది ఇంట్లో ప్రతి వస్తువుని కూడా వాస్తు ప్రకారం పెడుతూ ఉంటారు. గ్యాస్ సిలిండర్లను కూడా వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రతికూల శక్తి లేకుండా ఉంటుంది.

ఇంట్లో గ్యాస్ సిలెండర్ ఏ దిశలో ఉంటే మంచిది? (pinterest)
ఇంట్లో గ్యాస్ సిలెండర్ ఏ దిశలో ఉంటే మంచిది? (pinterest)

సాధారణంగా మనం వాడుతున్న సిలిండర్‌తో పాటు ఒక ఎక్స్ట్రా సిలిండర్ కూడా పెడుతూ ఉంటాము. అయితే, ఆ ఎక్స్ట్రా సిలిండర్ పెట్టేటప్పుడు వాస్తు నియమాలను పాటించాలి. దిశలను దృష్టిలో పెట్టుకుని ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పుడు దిశలో పెడితే మాత్రం ఇబ్బందులు, ప్రతికూల శక్తి ప్రభావం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంటే బాగుంటుంది?

వాస్తు ప్రకారం సరిగా లేకపోతే సమస్యలు వస్తాయి. గ్యాస్ సిలిండర్లను ఎప్పుడూ సరైన దిశలో పెట్టాలి. సరిగా లేకపోతే ఇంట్లో ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పేదరికం కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా రావచ్చు. గ్యాస్ సిలిండర్లను ఆగ్నేయ దిశలో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. లేకపోతే అడ్డంకులు ఏర్పడవచ్చు. ఒకవేళ ఆ దిశలో పెట్టడం కుదరకపోతే తూర్పు వైపు పెట్టుకోవచ్చు.

ఈ దిశల్లో మాత్రం గ్యాస్ సిలిండర్ పెట్టకండి:

ఉత్తరం లేదా వాయువ్య దిశలో పెట్టడం మంచిది కాదు. ఇది ప్రతికూల ఫలితాలను తీసుకొస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య సమస్యలు, గొడవలు ఏర్పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు దిశల్లో పెట్టకుండా చూసుకోండి.

ఈ తప్పులు కూడా చేయకుండా జాగ్రత్త పడండి:

  • గ్యాస్ స్టవ్‌కు ఎప్పుడూ కుడి వైపున గ్యాస్ సిలిండర్‌ను పెట్టండి. ఇది భద్రతపరంగా, వాస్తు పరంగా మంచిది.
  • సింక్ దగ్గర గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ పెట్టకండి. ఎందుకంటే సింక్ నీటి తత్వాన్ని సూచిస్తుంది.
  • గ్యాస్ సిలిండర్‌ను మూసివేసిన ప్రదేశంలో ఉంచకండి. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
  • ఎప్పుడూ సిలిండర్‌ను నిలబెట్టి ఉంచాలి. పడుకోబెట్టి లేదా పక్కకు వంచి పెట్టడం మంచిది కాదు.

నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More