యువతలో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా రెండు కొత్త స్వతంత్ర ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త డైరెక్టరేట్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు లభించగా, మరొకటి జార్ఖండ్ రాష్ట్రానికి కేటాయించారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ల సంఖ్య 17 నుండి 19కి పెరిగింది.

ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రాల పరిధిలో లేదా పొరుగు రాష్ట్రాలతో కలిపి ఎన్‌సీసీ సాగేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా స్వతంత్ర స్టేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల క్యాడెట్లకు, విద్యాసంస్థలకు ఎన్‌సీసీ సేవలు మరింత చేరువవుతాయి. ఈ కొత్త పరిపాలనా నిర్మాణం, శిక్షణ, అభివృద్ధి కార్యకలాపాల కోసం మరింత కేంద్రీకృత సమన్వయం, మెరుగైన పర్యవేక్షణ, మద్దతును అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇది మెరుగైన శిక్షణా మౌలిక సదుపాయాలు, సహాయక యంత్రాంగాల ద్వారా యువతకు మరిన్ని అవకాశాలను కూడా అందిస్తుంది.
రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక అధికారాలు ఉండటం వల్ల విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలతో ఎన్‌సీసీ కార్యకలాపాల సమన్వయం మరింత సులభతరం అవుతుంది. క్యాడెట్లకు ఇచ్చే శిక్షణను, వివిధ జిల్లాల్లోని బెటాలియన్ల పనితీరును ఉన్నతాధికారులు నేరుగా, నిరంతరం పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది.
కొత్త డైరెక్టరేట్ ఏర్పాటుతో కేంద్ర రక్షణ శాఖ నుంచి ప్రత్యేక నిధులు, శిక్షణా పరికరాలు నేరుగా రాష్ట్రానికి అందుతాయి. ఇది యువతకు అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీ విభాగం ఇప్పటివరకు తెలంగాణతో ముడిపడి ఉండేది. కానీ ఇక కొత్త స్వతంత్ర డైరెక్టరేట్‌తో ఏపీలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు ఎన్‌సీసీలో చేరేందుకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి.
అంతేకాకుండా రిపబ్లిక్ డే పరేడ్, జాతీయ స్థాయి క్యాంపులు, సాహస యాత్రలు, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడానికి మరిన్ని విస్తృత అవకాశాలు లభిస్తాయి. రక్షణ రంగం (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లో కెరీర్ ఎంచుకోవాలనుకునే ఏపీ యువతకు ఈ నిర్ణయం ఒక సువర్ణావకాశంగా మారనుంది. త్వరలోనే ఈ నూతన డైరెక్టరేట్ల కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
{{/usCountry}}అంతేకాకుండా రిపబ్లిక్ డే పరేడ్, జాతీయ స్థాయి క్యాంపులు, సాహస యాత్రలు, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడానికి మరిన్ని విస్తృత అవకాశాలు లభిస్తాయి. రక్షణ రంగం (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లో కెరీర్ ఎంచుకోవాలనుకునే ఏపీ యువతకు ఈ నిర్ణయం ఒక సువర్ణావకాశంగా మారనుంది. త్వరలోనే ఈ నూతన డైరెక్టరేట్ల కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
{{/usCountry}}మీరు చదువుతున్న స్కూల్ లేదా కాలేజీలో ఎన్‌సీసీ యూనిట్ ఉంటే.. అక్కడ ఉండే ఎన్‌సీసీ ఆఫీసర్‌ను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాలేజీలో ఎన్‌సీసీ లేకపోతే, సమీపంలోని ఎన్‌సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని సంప్రదించి ఓపెన్ క్యాడెట్ కోటా కింద చేరే అవకాశం కూడా ఉంటుంది.