...
...
Next Story

Bill Gates : రేపు ఏపీకి బిల్ గేట్స్ - టూర్ షెడ్యూల్ వివరాలివే

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రేపు ఏపీకి రానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశమవుతారు. అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Published on: Feb 15, 2026, 07:04:52 IST
Advertisement

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 16(రేపు)న రాష్ట్రానికి రానున్నారు. గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ తో భేటీ కానున్నారు.

బిల్ గేట్స్ టూర్ షెడ్యూల్…

ఏపీకి బిల్ గేట్స్
ఏపీకి బిల్ గేట్స్

ఏపీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్… సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాలలో ప్రభుత్వ ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్)ను బిల్ గేట్స్ పరిశీలిస్తారు. అక్క సాంకేతికత వినియోగ తీరును పరిశీలిస్తారు. రియల్‌టైం గవర్నెన్స్‌ విధానం, దాని ఫలితాల్ని గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తారు.

ఆ తర్వాత సీఎం, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో బిల్ గేట్స్ తో పాటు ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమవుతారు. స్వర్ణాంధ్ర 2047 (స్వర్ణాంధ్ర) విజన్, మెడ్-టెక్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్, హెల్త్ రికార్డ్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ వంటి అంశాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. సంజీవనితో సహా వివిధ రంగాలలో ప్రవేశపెట్టిన సంస్కరణలను వివరిస్తారు.

ఈ కార్యక్రమాల పూర్తి తరువాత బిల్ గేట్స్ మరియు అతని బృందం… అమరావతిలోని ఉండవల్లి గ్రామంలోని వ్యవసాయ కేంద్రానికి వెళతారు. డ్రోన్లు మరియు ఏఐ టెక్నాలజీ వినియోగాన్ని వీక్షిస్తారు. దీంతో బిల్ గేట్స్ పర్యటన పూర్తవుతుంది. మరోవైపు బిల్ గేట్స్ పర్యటన నేపథ్యంలో పట్టిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe