...
...
Next Story

AP Govt Recruitment 2026 : కర్నూలు జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే

కర్నూలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) కోసం కేటాయించిన 38 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వాళ్లు…. ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: May 10, 2026, 17:57:11 IST
Advertisement

Kurnool Backlog Recruitment 2026 : కర్నూలు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగులు) కోటా కింద ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 38 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 14వ తేదీ సాయంత్రం లోపు తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది.

ఉద్యోగ ప్రకటన (image source Pixel)
ఉద్యోగ ప్రకటన (image source Pixel)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో కార్యాలయ సహాయకుల నుంచి సాంకేతిక విభాగం వరకు వివిధ పలు ఖాళీలున్నాయి.

  • టైపిస్ట్
  • జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్
  • ల్యాబ్ అసిస్టెంట్
  • ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)
  • వాచ్‌మెన్
  • కుక్ (వంట మనిషి)
  • స్వీపర్
  • ఏఎన్‌ఎం (ANM) గ్రేడ్-III
  • పబ్లిక్ హెల్త్ వర్కర్

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు వారు ఎంచుకునే పోస్టుపై ఆధారపడి ఉంటాయి. ఐదో తరగతి పాసైన వారి నుంచి టెన్, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులు. 18 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య వయసున్న విభిన్న ప్రతిభావంతులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.

ఎంపిక విధానం ఇలా…

ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అకడమిక్ విద్యార్హతలలో సాధించిన మార్కులు, వారి వైకల్యం శాతాన్ని (Disability Percentage) ప్రాతిపదికగా తీసుకుని మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అత్యధిక మెరిట్ ఉన్న అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పారదర్శకమైన పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకునే విధానం…

ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe