AP RGUKT 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు - దరఖాస్తు విధానం ఇలా

RGUKT AP 2026 admissions : ఏపీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపసుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: May 4, 2026, 13:50:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RGUKT AP 2026 Admissions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ ఐఐఐటీ అడ్మిషన్లు
ఏపీ ఐఐఐటీ అడ్మిషన్లు

యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన వారు మే 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారి జాబితా (ప్రొవిజనల్) జూన్ 12, 2026 (టెంటేటివ్)తేదీన విడుదలవుతుంది. జూలై 1, 2026 నుంచి తరగతులు షురూ అవుతాయి.

RGUKT దరఖాస్తు చేసుకునే విధానం

  1. అధికారిక వెబ్‌సైట్ https://admissions.rgukt.in/ లో మీ వివరాలతో నమోదు చేసుకోగానే ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది.
  2. ఫీజు చెల్లింపు : ఓసీ/బీసీ అభ్యర్థులు 400 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలు ఆన్‌లైన్ లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలి.
  3. అప్లికేషన్ సమర్పణ: ఫీజు చెల్లించిన తర్వాత లాగిన్ అయ్యి మార్కుల వివరాలు, స్కూల్ వివరాలు , క్యాంపస్ ప్రిఫరెన్స్ నమోదు చేయాలి.
  4. డౌన్‌లోడ్: దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి. దీనిని ఎక్కడికీ పంపాల్సిన అవసరం లేదు.

కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ అడ్మిషన్లు ఉంటాయి. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. 2026లో మొదటి ప్రయత్నంలోనే ఎస్ఎస్‌సీ (SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్ 31, 2026 నాటికి అభ్యర్థి వయస్సు 18 ఏళ్ల లోపు ఉండాలి (SC/ST అభ్యర్థులకు 21 ఏళ్ల వరకు మినహాయింపు ఉంది). అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు RGUKT ఒక ప్రత్యేక నిబంధనను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి మార్కులకు అదనంగా 0.4 (డిప్రివేషన్ స్కోర్) కలుపుతారు. దీనివల్ల ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పోటీ పడటం వారికి సులభం అవుతుంది.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుకు చివరి తేదీ: మే 30, 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫలితాల ప్రకటన: జూన్ 12, 2026 (తాత్కాలిక మెరిట్ జాబితా)
  • ధ్రువపత్రాల పరిశీలన: జూన్ 19 నుండి జూన్ 23 వరకు (క్యాంపస్‌ల వారీగా ఉంటుంది)
  • నూజివీడు : 19-06-2026, 20-06-2026 వరకు.
  • ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ): జూన్‌ 19, 20 తేదీలు.
  • ఒంగోలు : జూన్‌ 22, 23.
  • శ్రీకాకుళం : జూన్‌ 22, 23.
  • అధికారిక వెబ్ సైట్ - https://admissions.rgukt.in/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More