BRAOU AP Degree Admissions : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు - చివరి తేదీ ఇదే

BRAOU AP Degree Admissions : ఏపీ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశముంది.

Published on: Aug 11, 2026, 07:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BRAOU AP Degree Admissions 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ అడ్మిషన్లు

ఉపాధి అవకాశాలు, ఉన్నత చదువులకు అనుగుణంగా డిజైన్ చేసిన పలు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ , బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (B.Sc - MPC - MPCs విభాగాల్లో), అలాగే ఒక సంవత్సరం వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి.

చివరి తేదీ ఎప్పుడంటే…?

ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 15వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.drbraouap.ac.in ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ సూచించారు. ప్రవేశాలు కోరే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన యూజీసీ-డిఇబి (UGC-DEB) నిబంధనల ప్రకారం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC-ID) తో పాటు DEB-ID ని తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్, 10+2 (NIOS / APOS), పాలిటెక్నిక్ డిప్లొమా, లేదా రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బిఎస్సీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి.

మొదటి సంవత్సరం సాధారణ డిగ్రీ కోర్సులకు ట్యూషన్ ఫీజు రూ. 3,300 గా నిర్ణయించారు. సైన్స్, కంప్యూటర్ కోర్సులు ఎంచుకున్న అభ్యర్థులు ప్రాక్టికల్స్ నిమిత్తం అదనంగా ప్రయోగశాల (లాబ్) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 73 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్, కోర్సు మెటీరియల్ సేవలను వర్సిటీ అందజేస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More