...
...
Next Story

AP KGBV Recruitment 2026 : ఏపీ కేజీబీవీల్లో 299 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - రాత పరీక్ష లేకుండానే..! దరఖాస్తు​ తేదీలివే

AP KGBV Recruitment 2026 : ఏపీ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 299 ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 5, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 30, 2026, 18:00:54 IST
Advertisement

AP KGBV Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టైప్-III కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు జరగనున్నాయి.

ఏపీ కేజీబీవీల్లో 299 బోధనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీ కేజీబీవీల్లో 299 బోధనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని మిగిలిన 352 కేజీబీవీలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :

మొత్తం 299 బోధనా సిబ్బంది (Teaching Staff) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

1. ప్రిన్సిపల్ (Principal): 16 పోస్టులు

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT): 98 పోస్టులు

3. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRT): 133 పోస్టులు

4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET): 52 పోస్టులు

అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్, యూజీడీపీఈడీ/బీపీఈడీ/ఎంపీఈడీ లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు మార్కులలో సడలింపు ఉంటుంది).

  • ప్రిన్సిపల్, సీఆర్‌టీ (అన్ని సబ్జెక్టులు), పీజీటీ (జనరల్ సబ్జెక్టులు) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీ టెట్ (APTET) లో ఖచ్చితంగా అర్హత సాధించి ఉండాలి. పీఈటీ మరియు పీజీటీ వోకేషనల్ పోస్టులకు టెట్ అర్హత అవసరం లేదు.
  • కేజీబీవీలలో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతుంది. అందువల్ల అభ్యర్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధించే సామర్థ్యం ఉండాలి. డిగ్రీ వరకు ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ చదివి ఉండాలి.
  • 01-07-2025 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. 45 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లుగాను, దివ్యాంగులకు 52 ఏళ్లుగాను నిర్ణయించారు.
  • గౌరవ వేతనం (నెలకు): ప్రిన్సిపల్ పోస్టుకు: రూ.34,139
  • పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు: రూ.26,759

అప్లికేషన్ ప్రాసెస్….

పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ అకడమిక్ మరియు ప్రొఫెషనల్ కోర్సులలో (SSC, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర) సాధించిన మార్కుల వెయిటేజీ ఆధారంగా మొత్తం 100 మార్కులకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి అభ్యర్థుల వివరాలను 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ (కలెక్టర్ ఆధ్వర్యంలో) కి పంపుతారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన తర్వాత పారదర్శకంగా తుది జాబితాను ప్రకటించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆఖరి తేదీ: 05.06.2026
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్: 09.06.2026
  • తుది మెరిట్ జాబితా ప్రదర్శన: 16.06.2026
  • నియామక ఉత్తర్వుల జారీ : 18.06.2026
  • రిపోర్టింగ్ తేదీ : 20.06.2026
  • అధికారిక వెబ్ సైట్ - http://kgbvrecruitment.apcfss.in

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks