గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 7 ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్ ఖాళీలను భర్తీ చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 28, 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
- ఉద్యోగ ఖాళీలు - 07 (ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్)
- ఈ 7 పోస్టులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తారు. (ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం)
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉండాలి.
తెలుగు, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. - వయోపరిమితి 33 నుంచి 63 ఏళ్లు ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
- దరఖాస్తు చివరి తేదీ - 28 నవంబర్ 2025
- దరఖాస్తు ఫారమ్ ను జనరల్ మేనేజర్, హెడ్ ఆఫీస్, ఫోర్త్ ఫ్లోర్, 4/1 Brodiepet, గుంటూరు-522002 చిరునామాలో సమర్పించాలి.
- అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000 చెల్లించాలి.
- ఎంపిక విధానం - అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూుకి పిలుస్తారు.గుంటూరులోని హెడ్ ఆఫీసులో వీటిని నిర్వహిస్తారు.
- ఎంపికైన వారికి నెలకు రూ.23,500 - రూ.30,000 మధ్య జీతం ఉంటుంది. (అలవెన్సులు కలిపి)
- ఏమైనా సందేహాలు ఉంటే fi@apgb.co.in మెయిల్ చేయవచ్చు.
- అప్లికేషన్ ఫారమ్ ను https://apgb.bank.in/notifications లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://apgb.bank.in/

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}