...
...
Next Story

Covid Cases in AP : ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ కేసులు - నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్..!

Covid Cases in AP : ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన నలుగురు కొవిడ్ బాధితుల్లో ఒమిక్రాన్ కొత్త సబ్-వేరియంట్ ‘RF.5’ ఉన్నట్లు పూణె ల్యాబ్ నిర్ధారించింది. ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయపడాల్సిన పనిలేదని…. సాధారణ ఒమిక్రాన్ లక్షణాలే ఉంటాయని ఆరోగ్య శాఖ తెలిపింది.

Published on: Jul 19, 2026 12:58 PM IST
Advertisement

Covid Cases in Andhrapradesh : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన ‘RF.5’ రకం బారిన పడిన నలుగురు బాధితులను గుర్తించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

కొవిడ్ కేసులు
కొవిడ్ కేసులు

కడప జిల్లాకు చెందిన నలుగురు కొవిడ్ బాధితుల శాంపిళ్లను పూణేలోని జాతీయ వైరాలజీ లాబొరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా…. ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొత్త వేరియంట్ వెలుగుచూడటంతో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని అంచనా వేశారు.

భయపడాల్సిన పనిలేదు….

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. రెగ్యులర్ జీనోమ్ సర్వైలెన్స్‌లో భాగంగానే ఈ RF.5 వేరియంట్‌ను గుర్తించామన్నారు. సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీనిపై నిఘా ఉంచిందని తెలిపారు. అయితే… ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఈ RF.5 వేరియంట్ ఇతర ఒమిక్రాన్ రకాల కంటే ప్రమాదకరమైనదనే సూచనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేవలం అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు.

లక్షణాలు ఇలా…

ఈ కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణ ఒమిక్రాన్ లాగే గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులుగా ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా… రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు చాలా తక్కువగా (స్పోరాడిక్) ఉన్నాయని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ భరోసా ఇచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe