తీవ్ర తుపాను మురసు(Murasu Severe Cyclonic Storm) ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడటంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో సుమారు 30,661 హెక్టార్లలో నిలబడి ఉన్న పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

మురసు తుపాను ధాటికి ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షపు నీరు పొలాల్లో చేరడంతో చేతికి వచ్చిన పంటలు పాడైపోయాయి. ముఖ్యంగా దెబ్బతిన్న పంటలు చూసుకుటే.. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లింది.
వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం అంచనాను త్వరలోనే పూర్తి చేసి బాధితులకు పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర తుపాను 15 జిల్లాల్లోని 132 మండలాలపై అసాధారణ ప్రభావాన్ని చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో అధికారులు త్వరితగతిన స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల నుండి 10,805 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుపాను షెల్టర్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం 171 బియ్యం/ఆహార పరిమితి శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఇప్పటివరకు 14,810 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ కోసం 613 జనరేటర్లను సిద్ధం చేసి వినియోగిస్తున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ, సహాయక చర్యల కోసం భారీగా బలగాలను మోహరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 11 బృందాలు రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 13 బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగించడానికి, నిలిచిపోయిన నీటిని తోడేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ 185 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. తుపాను తీవ్రతను ముందుగానే ఊహించిన రాష్ట్ర యంత్రాంగం ముందస్తు హెచ్చరికలతో చర్యలు చేపట్టింది. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి 3,066 మంది గర్భిణులు, 1,008 మంది బాలింతలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, సురక్షిత వైద్య కేంద్రాలకు ముందస్తుగా తరలించారు.
{{/usCountry}}రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగించడానికి, నిలిచిపోయిన నీటిని తోడేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ 185 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. తుపాను తీవ్రతను ముందుగానే ఊహించిన రాష్ట్ర యంత్రాంగం ముందస్తు హెచ్చరికలతో చర్యలు చేపట్టింది. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి 3,066 మంది గర్భిణులు, 1,008 మంది బాలింతలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, సురక్షిత వైద్య కేంద్రాలకు ముందస్తుగా తరలించారు.
{{/usCountry}}వ్యాధులు వ్యాపించకుండా 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 362 అంబులెన్సులను నిరంతరం అందుబాటులో ఉంచారు.
వర్షాలు తగ్గిన తర్వాత దోమలు, నీటి ద్వారా వచ్చే వ్యాధులు (డెంగ్యూ, మలేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్) విజృంభించే అవకాశం ఉంది. నిల్వ ఉన్న నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆరోగ్య శాఖ సూచించింది. వైద్య శిబిరాలు, 104 సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు.