...
...
Next Story

AP Bharosa Pension : ఏపీ పింఛన్ దారులకు అలర్ట్ - 1వ తేదీన ఉద‌యం నుంచే డబ్బుల పంపిణీ

AP NTR Bharosa Pension Distribution : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసింది.

Published on: Sep 29, 2026, 06:02:55 IST
Advertisement

AP NTR Bharosa Pension Distribution : భరోసా పింఛనుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గతంలో ప్రకటించిన సవరించిన వేళలతో సంబంధం లేకుండా…. ఎప్పటిలాగే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన్ల నగదును అందజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రకటన విడుదల చేశారు.

ఉదయం నుంచే పంపిణీ….

ఏపీ పింఛన్లు
ఏపీ పింఛన్లు

బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను విరమించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని మంత్రి వివరించారు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీనే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి 100 శాతం పింఛను నగదును విత్‌డ్రా చేసుకుంటారని… అక్టోబర్ 1వ తేదీ తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా నగదు అందజేస్తారని తెలిపారు.

అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం నిధుల్లో రూ.2,692.28 కోట్లను నేరుగా పంచాయతీ, వార్డుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన రూ. 6 లక్షలను విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని ఎన్‌ఎస్ఏపీ పింఛనుదారుల ఖాతాలకు డిజిటల్ పద్ధతిలో నేరుగా జమ చేయనున్నారు.

పక్కాగా ఏర్పాట్లు – అధికారులకు ఆదేశాలు

సెప్టెంబర్ 30వ తేదీ నాటికే పంపిణీకి కావలసిన పూర్తి నగదు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి మరియు బ్యాంకు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా 1వ తేదీనే వేళకు పింఛన్లు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks