...
...
Next Story

ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు : సీఎం చంద్రబాబు

మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా వెనకబడిన వర్గాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదరణ-3 పథకం ద్వారా ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Published on: Feb 4, 2026, 20:18:57 IST
Advertisement

వెనకబడిన వర్గాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బీసీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు అక్కడ సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు హాస్టళ్లలో శానిటేషన్ తో పాటు విద్యార్ధులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వెల్లడించారు.

'విద్యార్థుల ఆరోగ్యం, విద్యా బోధన సహా అన్ని అంశాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలి. బీసీ విద్యార్థులకు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి అనుసంధానం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఉన్న 6 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వారికి ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks