ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేల కోట్లు మళ్లిస్తున్నారు : కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేల కోట్లు మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అవినీతి బయటపెడుతోంది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి తన బినామీ కంపెనీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. KLSR కంపెనీ అవినీతి బాగోతం బయటకు వచ్చిందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. KLSR మొదటి నుండి రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రికి ఆ సంస్థకు మధ్య ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవని కేటీఆర్ నొక్కిచెప్పారు.

దివాలా తీసిన కంపెనీలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీకి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందన్నారు. కంపెనీ అవకతవకలపై దర్య్తాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనవరి 23న సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.
తన బినామీ కార్యకలాపాలు బహిర్గతమవుతాయనే భయంతో రేవంత్ రెడ్డి దావోస్ నుండి ఒక రాజకీయ నాటకాన్ని నడిపించారని, ప్రజలను మళ్లించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు ముసుగులో దీనిని నిర్వహించారని కేటీఆర్ అన్నారు. దివాలా తీసిన సంస్థ అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలని, అర్హత లేకుండా పొందిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు.
2018లో KLSRపై ఐటీ దాడులు జరిగాయని కేటీఆర్ అన్నారు. 2023లో కంపనీ దివాలా తీసిందన్నారు. పెద్ద భూములను స్వాధీనం చేసుకోవడానికి KLSR ద్వారా నిధులు మళ్లించబడ్డాయని, ఏజెన్సీలు గతంలో తమ దర్యాప్తులో ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన పునరుద్ఘాటించారు. దివాలా తీసినప్పటికీ KLSR ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను పొందిందని కేటీఆర్ ఆరోపించారు. వీటిలో AMRUT పథకం, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఉన్నాయన్నారు.
'ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో ముఖ్యమంత్రి వివరించాలి. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి రూ. 15 లక్షలు కూడా లేక బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. ఈ కంపెనీలోకి వందల కోట్ల ట్రాన్సాక్షన్‌పై దర్యాప్తు చేయాలని, న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రయత్నాలను పరిశీలించాలని కేంద్రం, రాష్ట్రం రెండింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది.' అని కేటీఆర్ అన్నారు.
ఈ విషయంపై సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసిందని కేటీఆర్ చెప్పారు. ఈ నోటీసుల నుండి దృష్టిని మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు, సిట్ అంటూ తెరమీదకు తీసుకొచ్చారని తెలిపారు. దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నోటీసులను ముఖ్యమంత్రి ఎందుకు దాచిపెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


