శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా.. కర్నూలు పర్యటన సందర్భంగా తెలుగులో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
అక్టోబర్ 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఉంది. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టుగా వెల్లడించారు.
శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తానని తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

'రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. గురువారం ఉదయం 7.20 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి ఎంఐ-17 హెలికాప్టర్‌లో బయల్దేరి 10.35 గంటలకు సుందిపెంటకు చేరుకుంటారు మోదీ. అక్కడ నుంచి 10.55 గంటలకు శ్రీశైలం వస్తారు. 11.15 గంటలకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. 12.05 గంటలకు శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడ నుంచి 12.40 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు సుందిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్‌లో వెళ్తారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధానమంత్రి కర్నూలులో కార్యక్రమంలో పాల్గొని పరిశ్రమ, విద్యుత్, మౌలిక సదుపాయాలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. కర్నూలు-III పూలింగ్ స్టేషన్‌లో రూ.2,880 కోట్లకు పైగా పెట్టుబడితో ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ బలోపేతం కోసం శంకుస్థాపన చేస్తారు.
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. రూ.4,920 కోట్ల మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాలు రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని, రాయలసీమ ప్రాంతంలో సుమారు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు.
రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రధాని రూ.960 కోట్ల వ్యయంతో సబ్బవరం నుండి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన చేస్తారు. రద్దీని తగ్గించడం, భద్రతను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా జాతీయ రహదారులు, బైపాస్‌లలో కీలకమైన అప్‌గ్రేడ్‌లతో సహా రూ.1,140 కోట్ల విలువైన ఆరు రోడ్డు ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. వీటితోపాటుగా మరికొన్ని ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


