ప్రధాని మోదీ ఏపీ టూర్ - రేపు శ్రీశైలం రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు..!

ఈనెల 16వ తేదీన ప్రధానమంత్రి మోదీ ఏపీకి రానున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకుంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Published on: Oct 15, 2025 8:43 AM IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(అక్టోబర్ 16) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వర్ల దేవస్థానం దర్శనంతో పాచు శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాలను సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలుకు వెళ్తారు. రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈనెల 16న ఏపీకి ప్రధాని మోదీ
ఈనెల 16న ఏపీకి ప్రధాని మోదీ

ఈ పర్యటనలో భాగంగా శ్రీశైలంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేయనున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు.ఆ తర్వాత ప్రత్యేక నమూనాలతో కూడిన ధ్యాన మందిరాన్ని కలిగి ఉన్న శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…

ఆ తర్వాత కర్నూలులో ప్రధాని మోదీ పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇందులో పరిశ్రమలు, విద్యుత్ ప్రసారం, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువుతో సహా కీలక రంగాలలో విస్తరించి ఉన్న సుమారు రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులున్నాయి. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు.

కర్నూలు-3 పూలింగ్ స్టేషన్ లో రూ.2,880 కోట్ల పెట్టుబడితో ట్రాన్స్ మిషన్ సిస్టమ్ స్ట్రెన్థింగ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో 765 కెవి డబుల్ సర్క్యూట్ కర్నూలు-III పూలింగ్ స్టేషన్-చిలకలూరిపేట ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ఉంది. కర్నూలులోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా, కడపలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు రూ.4,920 కోట్ల పెట్టుబడితో ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

విశాఖపట్నంలో రద్దీని తగ్గించడం, వాణిజ్యం, ఉపాధిని సులభతరం చేయడం లక్ష్యంగా రూ.960 కోట్లకు పైగా వ్యయంతో సబ్బవరం నుంచి షీలానగర్ వరకు ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదనంగా మొత్తం రూ.1,140 కోట్ల విలువైన ఆరు రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.1,200 కోట్లకు పైగా విలువైన పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కొత్త-విజయనగరం నాల్గవ రైల్వే లైన్, పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైలు ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 124 కిలోమీటర్లు, ఒడిశాలో 298 కిలోమీటర్ల మేర సుమారు రూ.1,730 కోట్ల వ్యయంతో నిర్మించిన గెయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీకాకుళం-అంగుల్ సహజ వాయువు పైప్ లైన్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్లో ని చిత్తూరులో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కు చెందిన 60 టీఎంటీపీఏ (ఏడాదికి వెయ్యి మెట్రిక్ టన్నులు) ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. రక్షణ రంగాన్ని మరిత బలోపేతం చేసేందుకు కృష్ణా జిల్లా నిమ్మలూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.360 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించనున్నారు.

శ్రీశైలం రోడ్డులో ఆంక్షలు…!

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. హైదరాబాద్‌- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సూచనలకు అనుగుణంగా ప్రయాణికులు…రాపపోకలు సాగించుకోవాలని సూచించారు.

News/Andhra Pradesh/ప్రధాని మోదీ ఏపీ టూర్ - రేపు శ్రీశైలం రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు..!
News/Andhra Pradesh/ప్రధాని మోదీ ఏపీ టూర్ - రేపు శ్రీశైలం రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు..!