Amrit Bharat Express: పోదనూర్ టు ధన్‌బాద్ - ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, ఆగే స్టేషన్లు ఇవే
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది. పోదనూర్ - ధన్‌బాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్… రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రాకపోకలు సాగించనుంది. పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్‌బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ను బుధవారం ప్రారంభించారు.ఈ అమృత్ భారత్ ట్రైన్ సర్వీస్….. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తోంది.

పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్‌బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్, హాల్డింగ్ స్టేషన్ల వివరాలను రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
పోదనూర్ (కోయంబత్తూరు) - ధన్‌బాద్ (ట్రైన్ 16619) శనివారం ఉదయం 6.15 గంటలకు బయల్దేరుతుంది. 06:30 నిమిషాలకు కోయంబత్తూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 15:05 నిమిషాలకు ఏపీలోని రేణిగుంట స్టేషన్ కు చేరుకుంటుంది.అంతేకాకుండా నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, ఝార్సుగూడ మీదుగా ధన్ బాద్ చేరుకుంటుంది. ఇక ధన్ బాద్ - పోదనూర్ (ట్రైన్ నెంబర్ 16620) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ బుధవారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 1 పాంట్రీ కార్ (ఆహార సదుపాయం), సెకండ్ క్లాస్ కోచ్‌లు (దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి) ఉంటాయి.
హాల్టింగ్ స్టేషన్లు:
కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, తిరుత్తణి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయఘడ్, మునిగుడ, రాంఛీ, మురి, బోకారో స్టీల్ సిటీ, చంద్రాపుర స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ ట్రైన్ స్టాపేజీ టైమింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ అమృత్ భారత్ ట్రైన్ ద్వారా పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

