కొత్తగా చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగేది ఈ స్టేషన్లలోనే

Amrit Bharat Express Charlapalli-Kamakhya : తెలుగు రాష్ట్రాలకు భారతీయ రైల్వే మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే చర్లపల్లి-నాగర్‌కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చర్లపల్లి-కామాఖ్య మధ్య కూడా అమృత్ భారత్ రైలు నడవనుంది.

Updated on: Mar 10, 2026, 15:09:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారికి శుభవార్త. తక్కువ ఖర్చుతో వెళ్లిరావొచ్చు. భారతీయ రైల్వే హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ అమృత్ భారత్ రైలు మార్చి 13, 2026 నుండి ప్రారంభం అవుతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని ఈశాన్య ప్రాంతం మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు
చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు

రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 13న కామాఖ్య నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సేవలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవి సుదూర ప్రయాణికులకు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్ అందిస్తాయి.

ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అస్సాంతో కలుపుతుంది. ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా అస్సాంని చెబుతారు. అమృత్ భారత్ రైలు ఈశాన్య ప్రాంతానికి ప్రయాణించే, తిరిగి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అంతేకాగు తక్కువ ధరలో వెళ్లి రావొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో స్టాప్‌లు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీదుగా ప్రయాణించే సమయంలో రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఏయే స్టాప్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. కామాఖ్య నుంచి వచ్చే సమయంలో ఈ కింది స్టేషన్లలో ఆగుతుంది.

  • ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు,
  • తెలంగాణ : నల్గొండ, చర్లపల్లి

చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ రైలు వెళ్లే సమయంలో కూడా పైన చెప్పిన స్టేషన్లలో ఆగుతుంది. రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడం, దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల మధ్య ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించడం కోసం ఈ కొత్త సేవను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.

నాగర్‌కోయిల్ - చర్లపల్లి

హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌‌ను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. నాగర్‌కోయిల్ - చర్లపల్లి కొత్త సర్వీసు మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.

దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం భారతీయ రైల్వే.. కొత్తగా నాగర్‌కోయిల్-చర్లపల్లి-నాగర్‌కోయిల్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందించనున్నది.

చర్లపల్లి(హైదరాబాద్) నుంచి బయలుదేరే ఈ ట్రైన్.. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లాం మీదుగా నాగర్ కోయిల్(తమిళనాడు)కు చేరుకుంటుంది.

సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More