Amrit Bharat Express : ఆంధ్రప్రదేశ్ మీదుగా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. చర్లపల్లి-నాగర్‌కోయిల్
Amrit Bharat Express : ఆంధ్రప్రదేశ్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్తగా వెళ్లనుంది. చర్లపల్లి-నాగర్‌కోయిల్ మధ్య ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైల్వే బోర్డు హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇది హైదరాబాద్‌కు కనెక్ట్ అయిన మూడో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. నగరం నుండి మొదటి సర్వీస్ ముజఫర్‌పూర్‌కు ఉంది. తిరువనంతపురం నుండి మరొక రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ప్రారంభించారు.

అమృత్ భారత్ రైలులో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్(నాన్ ఏసీ)లు ఉంటాయని అధికారులు తెలిపారు. కార్యకలాపాల ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతుంది. త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
అమృత్ భారత్ రైళ్లను సుదూర ప్రయాణికులకు బడ్జెట్ ఫ్రెండ్లీ సేవలుగా రూపొందించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు దాదాపు 800 కి.మీ దూరంలో ఉన్న లేదా 10 గంటల కంటే ఎక్కువ ప్రయాణం అవసరమయ్యే ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాయి.
సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే దీనిని ప్రారంభం జరగనుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు
మరోవైపు రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ - యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం... గతంలో ఉన్న టైమింగ్ ప్రకారం... యశ్వంతపూర్ - కాచిగూడ (ట్రైన్ నెంబర్ 20704) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03.48 నిమిషాలకు హిందూపూర్ చేరుకునేది. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 03.55 నిమిషాలకు చేరుకుని... మధ్యాహ్నం 03. 57 నిమిషాలకు బయల్దేరుతుంది.
కాచిగూడ - యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 నిమిషాలకు హిందూపూర్ రైల్వే స్టేషన్ చేరుకుని 12.10 నిమిషాలకుగు బయల్దేరేది. కానీ ఇకపై మధ్యాహ్నం 12.17 నిమిషాలకు చేరుకుని... 12.19 నిమిషాలకు బయల్దేరుతుంది. మారిన టైమింగ్స్ మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












