RRB recruitment 2026 : 22,195 రైల్వే పోస్టులు- అప్లికేషన్ గడువు పెంపు, పూర్తి వివరాలు..
RRB recruitment 2026 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్బీ) 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువును మార్చి 9, 2026 వరకు పొడిగించింది. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్బీ) కీలక ప్రకటన చేసింది. 2026 సంవత్సరానికి గాను 22,195 గ్రూప్ డీ (లెవల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ముగియాల్సిన ఈ గడువును.. ఇప్పుడు మార్చి 9, 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో దరఖాస్తు చేసుకోని వారికి మరో వారం రోజుల అదనపు సమయం లభించింది.

ఈ నేపథ్యంలో ఈ ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీలు, వయోపరిమితి, జీతం..
మొత్తం ఖాళీలు: 22,195
వయోపరిమితి: జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ-ఎన్సీఎల్కి 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది).
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన సర్టిఫికేట్ ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,000 ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలొవెన్సులు లభిస్తాయి.
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం..
అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్షలు
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- సీబీటీ సరళి..
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్లో భాగంగా నిర్వహించే సీబీటీలో మొత్తం 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు
మ్యాథమెటిక్స్: 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్: 20 ప్రశ్నలు
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము, రీఫండ్ పాలసీ..
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, మాజీ సైనికులు, పిడబ్ల్యూబీడీ అండ్ ఈబీసీ: రూ. 250 (పరీక్షకు హాజరైన తర్వాత ఈ మొత్తం పూర్తిగా వెనక్కి వస్తుంది).
ఇతర అభ్యర్థులు: రూ. 500 (పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ చేస్తారు).
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9, 2026 (రాత్రి 11:59 వరకు)
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 11, 2026
దరఖాస్తు సవరణ విండో: మార్చి 12 నుంచి మార్చి 21, 2026 వరకు
స్క్రైబ్ వివరాల సమర్పణ: మార్చి 22 నుంచి మార్చి 26, 2026 వరకు
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2026 కోసం ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in సందర్శించండి.
స్టెప్ 2- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేయండి.
స్టెప్ 3- మీరు కోరుకున్న ఆర్‌ఆర్బీ రీజియన్‌ను ఎంచుకుని వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


