CBSE Exams 2026 : పదో తరగతి విద్యార్థులకు అప్డేట్.. పరీక్షల విధానంపై సీబీఎస్ఈ కీలక ప్రకటన!
పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షల విధానంపై సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు మెుదటి బోర్డు పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
10వ తరగతి విద్యార్థులు మొదటి బోర్డు పరీక్ష రాయడం తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్‌లో కనీసం మూడు సబ్జెక్టులకు ప్రయత్నించని వారిని 'ఎసెన్షియల్ రిపీట్' కేటగిరీలో ఉంచుతామని సీబీఎస్ఈ పేర్కొంది.

సీబీఎస్ఈ 2026 నుండి 10వ తరగతికి రెండు బోర్డు పరీక్షలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల 10వ తరగతి విద్యార్థులు మొదటి బోర్డు పరీక్ష రాయలేరని, అందువల్ల వారిని రెండో బోర్డు పరీక్ష రాయడానికి అనుమతించాలని కొన్ని అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది బోర్డు.
హాజరు తప్పనిసరి
'అందరు విద్యార్థులు మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి. ఉత్తీర్ణులైన, అర్హత కలిగిన విద్యార్థులందరూ సైన్స్, గణితం, సోషల్, లాంగ్వేజస్ మూడు సబ్జెక్టులలో దేనిలోనైనా తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి అనుమతిస్తారు.' అని సీబీఎస్ఈ పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ అన్నారు.
రెండు బోర్డు పరీక్షకు నో ఛాన్స్
ఒక విద్యార్థి మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో హాజరు కాకపోతే, అతను లేదా ఆమె రెండో పరీక్షకు హాజరు కావడానికి అనుమతి ఉండదు. అలాంటి విద్యార్థులను ఎసెన్షియల్ రిపీట్ విభాగంలో ఉంచుతారని భరద్వాజ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మాత్రమే ప్రధాన పరీక్ష రాయగలరన్నారు.
ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు
మొదటి పరీక్షలో కంపార్ట్మెంట్ ఉన్న విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీ కింద రెండో పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. మెుదటి పరీక్ష తప్పనిసరిగా రాయాలి. రెండో బోర్డు పరీక్షలు ఆప్షనల్. సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు మంగళవారం(ఫిబ్రవరి 17) ప్రారంభం కానున్నాయి. 46 లక్షల మంది విద్యార్థులు దేశ, విదేశాల నుంచి హాజరు కానున్నారు.
రెండో బోర్డు పరీక్ష అప్పుడే
పదో తరగతి విద్యార్థులకు మొదటి బోర్డు పరీక్ష ఫిబ్రవరి - మార్చి 2026లో జరుగుతుంది(ఇది తప్పనిసరి). రెండో పరీక్ష మే 15, 2026 నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు జరుగుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకుంటే.. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ లేదా లాంగ్వేజస్‌లో ఏవైనా మూడు సబ్జెక్టులను ఎంచుకుని రెండోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులనే ఫైనల్ స్కోరుగా చూస్తారు.
ఆలస్యం చేయకండి
సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం.. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకల్లా చేరుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. 10:00 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని హెచ్చరించింది.
ఆన్-స్క్రీన్ మార్కింగ్
సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థుల జవాబు పత్రాల దిద్దుబాటులో పారదర్శకత కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. జవాబు పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్ స్క్రీన్‌పైనే డిజిటల్‌గా దిద్దుతారు. దీనివల్ల టోటలింగ్ తప్పులు జరగవు, ఫలితాలు కూడా వేగంగా వెల్లడవుతాయి. అయితే, పదో తరగతికి మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే మాన్యువల్ దిద్దుబాటు కొనసాగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


