నిరుద్యోగులకు అలర్ట్​! 22195 ఆర్​ఆర్బీ గ్రూప్-డీ పోస్టులకు రిజిస్ట్రేషన్​- పూర్తి వివరాలు..

RRB Group D Recruitment 2026 : భారతీయ రైల్వేలో కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) నుంచి బిగ్​ అప్డేట్​. గ్రూప్-డీ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 02, 2026 1:16 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) గ్రూప్-డీ పోస్టుల భర్తీకి సంబంధించి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 22,195 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు.. (Rajkumar)
ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు.. (Rajkumar)

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026..

ముఖ్యమైన తేదీలు ఇవే:

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 2, 2026. సమర్పించిన దరఖాస్తులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి మార్చి 4, 2026 వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, అందుకోసం మాడిఫికేషన్ విండో మార్చి 5న ప్రారంభమై, మార్చి 14, 2026న ముగుస్తుంది.

అర్హత ప్రమాణాలు:

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి నిర్ణయించిన చివరి తేదీ (అంటే 02.03.2026) నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీ నుంచి సీఈఎన్​ (సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీసు)లో సూచించిన విధంగా అవసరమైన విద్యా లేదా సాంకేతిక అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము వివరాలు:

అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 500/- గా నిర్ణయించారు. ఈ మొత్తం నుంచి, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కి హాజరైన అభ్యర్థులకు వర్తించే బ్యాంక్ ఛార్జీలను మినహాయించి, మిగిలిన రూ. 400/- మొత్తాన్ని నిర్ణీత సమయంలో తిరిగి రీఫండ్ చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ), మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) అభ్యర్థులకు పరీక్షా రుసుము రూ. 250/- మాత్రమే.

కేవలం సీబీటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు మాత్రమే పైన పేర్కొన్న విధంగా పరీక్షా రుసుము రీఫండ్ అవుతుంది. ఫీజు చెల్లింపును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు లేదా యూపీఐ ద్వారా చేయవచ్చు.

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా ఆర్​ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'RRB Group D Recruitment 2026' రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 30 అక్కడ ఓపెన్ అయ్యే కొత్త పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి.

స్టెప్​ 4- 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ తెరపై కనిపిస్తుంది.

స్టెప్​ 5- అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.

స్టెప్​ 6- చివరగా సబ్మిట్ క్లిక్ చేసి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 7- భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్ కాపీని (ప్రింట్ అవుట్) భద్రపరుచుకోండి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్​ఆర్బీ గ్రూప్​-డీ అప్లికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.