భారత నావికాదళంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..

భారత నావికాదళం 2027 జనవరి కోర్సు కోసం ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లలో 260 ఎస్ఎస్‌సీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jan 27, 2026, 05:46:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత నావికాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్​ఎస్​సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ (ఐఎన్​ఏ)లో 2027 జనవరి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

భారత నావికాదళంలో ఉద్యోగ అవకాశం..
భారత నావికాదళంలో ఉద్యోగ అవకాశం..

మొత్తం 260 ఖాళీలు ఉండగా.. వీటిని ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 24, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ 2026- బ్రాంచ్ వారీగా ఖాళీల వివరాలు..

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:

ఎస్ఎస్‌సీ జనరల్ సర్వీస్ (జీఎస్​/ఎక్స్​): 76 పోస్టులు (వీటిలో 6 హైడ్రో పోస్టులు ఉన్నాయి)

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ): 18 పోస్టులు

నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (ఎన్​ఏఓఓ): 20 పోస్టులు

ఎస్ఎస్‌సీ పైలట్: 25 పోస్టులు

ఎస్ఎస్‌సీ లాజిస్టిక్స్: 10 పోస్టులు

టెక్నికల్ బ్రాంచ్:

ఇంజనీరింగ్ విభాగం (జనరల్ సర్వీస్): 42 పోస్టులు

ఎలక్ట్రికల్ విభాగం (జనరల్ సర్వీస్): 38 పోస్టులు

సబ్‌మెరైన్ టెక్నికల్ (ఇంజనీరింగ్): 08 పోస్టులు

సబ్‌మెరైన్ టెక్నికల్ (ఎలక్ట్రికల్): 08 పోస్టులు

ఎడ్యుకేషన్ బ్రాంచ్:

ఈ రిక్రూట్‌మెంట్ సైకిల్‌లో మొత్తం 15 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ 2026- ఇతర వివరాలు..

వయోపరిమితి: అభ్యర్థులు జులై 2, 2002, జులై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండు తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యార్హతలు: బ్రాంచ్, వారు ఎంచుకునే విభాగం ఆధారంగా విద్యార్హతలు మారుతూ ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోని మెజారిటీ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్​ పూర్తి చేసి ఉండాలి.

ఏటీసీ, ఎన్​ఏఓఓ, ఎస్ఎస్‌సీ పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు బీఈ/బీటెక్​తో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్‌లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండటం తప్పనిసరి.

ఎస్ఎస్‌సీ లాజిస్టిక్స్ కోసం బీఈ/బీటెక్​, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్​సీ (ఐటీ), బీఎస్​సీ, బీకామ్​ లేదా బీఎస్​సీ (ఐటీ) తో పాటు ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమా ఉన్నవారు అర్హులు. అయితే వీరు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించి ఉండాలి.

టెక్నికల్ బ్రాంచ్ కోసం సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులతో బీఈ/బీటెక్​ డిగ్రీ కలిగి ఉండాలి.

ఎడ్యుకేషన్ బ్రాంచ్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంఎస్​సీ) లేదా బీఈ/బీటెక్​/ఎంటెక్​ పూర్తి చేసి ఉండాలి.

ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు చేసుకోవడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ను సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో 'SSC Officer January 2027 Course' కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 3- అవసరమైన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.

స్టెప్​ 4- దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు 2027 SSC ఇన్‌టేక్ కోసం విజయవంతంగా రిజిస్టర్ అవుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More