SCR Special Trains : తిరుపతి - సికింద్రాబాద్, మచిలీపట్నం - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి - సికింద్రాబాద్, మచిలీపట్నం - కాచిగూడ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఈ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి.

Published on: Jan 25, 2026, 13:49:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈనెల 26వ తేదీన ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్స్ వెళ్తాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

స్పెషల్ ట్రైన్స్
స్పెషల్ ట్రైన్స్

తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ నెంబర్ 07505) మధ్య జనవరి 26న వన్ వే స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలు తిరుపతి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరుతుంది. ఇది రాయలసీమ మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గూటి, గుంతకల్, ఆదోని, రాయచూర్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇక మచిలీపట్నం - కాచిగూడ (రైలు నెంబర్ 07506) మధ్య జనవరి 26న వన్ వే స్పెషల్ ట్రైన్ ఉంటుంది. మచిలీపట్నంలో రాత్రి 9:15 గంటలకు మచిలీపట్నంలో మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ వన్ వే స్పెషల్ ట్రైన్…. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, చర్లపల్లి, మల్కాజిగిరి స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఈ ట్రైన్‌లో జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More