Train accident : పట్టాలు తప్పి.. మరో రైలును ఢీకొట్టిన ట్రైన్​- 21మంది మృతి

స్పెయిన్​లో విషాదం చోటుచేసుకుంది. ఓ రైలు పట్టాలు తప్పి, అటుగా వస్తున్న మరో ట్రైన్​ని ఢీకొట్టింది. అనంతరం ఆ రైలు కూడా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20కిపైగా మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

Published on: Jan 19, 2026 5:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్పెయిన్​లో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హై- స్పీడ్​ రైలు పట్టాలు తప్పింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న మరో ట్రైన్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 21మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని చూస్తుంటే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

స్పెయిన్​ రైలు ప్రమాదం.. (Reuters)
స్పెయిన్​ రైలు ప్రమాదం.. (Reuters)

స్పెయిల్​లో రైలు ప్రమాదం- అసలేం జరిగింది?

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు, దక్షిణ స్పెయిన్​లోని కార్బొడాలో అడముజ్​ స్టేషన్​కు సమీపంలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మలగా నుంచి మాడ్రిడ్​ వెళుతున్న ఓ రైలు తొలుత పట్టాలు తప్పింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఆ రైలు మాడ్రిడ్​ నుంచి హుల్వాకు వెళుతోంది. అనంతరం ఆ రైలు కూడా పట్టాలు తప్పింది.

స్పెయిన్​ రైలు ప్రమాదం కారణంగా ఘటనాస్థలం అత్యంత భయానకంగా మారింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంగణం దద్ధరిల్లిపోయుంది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు. అనేక మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కాగా రైళ్లపై యాక్సిడెంట్​ ప్రభావం అధికంగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు వెల్లడించారు.

స్పెయిన్​ రైలు ప్రమాదం కారణంగా మాడ్రిడ్​ నుంచి అడలుసియా మధ్య హై-స్పీడ్​ రైలు సేవలు నిలిచిపోయాయి. కాగా కమర్షియల్​ సర్వీసు మాత్రం కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు.

స్పెయిన్​ రైలు ప్రమాదంపై ఆ దేశ రాజు ఫిలిపే 6, రాణి లిటిజియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

పెరిగిపోతున్న రైలు ప్రమాదాలు..

రైలు ప్రమాద వార్త.. గత వారం రోజుల్లో ఇది రెండోసారి! థాయిలాండ్​లో ఓ రైలు పట్టాలు తప్పడంతో 22మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

థాయిలాండ్​ రాజధాని బ్యాంకాక్​ నుంచి రైలు బయలుదేరిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక చోట హై-స్పీడ్​ రైలు ప్రాజెక్ట్​ జరుగుతోంది. ఆ ప్రాంతంలో ఒక క్రెయిన్​ కూలిపోయింది. అది రైలు మీద పడింది. అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఆ వెంటనే రైలుకు మంటలు అంటుకున్నాయి.

ఇక స్పెయిన్​లో తాజా ఘటన.. కొన్నేళ్ల క్రితం ఇండియాలో జరిగిన విషాదాన్ని గుర్తుచేస్తోంది. ఒడిశా బాలాసోర్​ సమీపంలో రెండు రైళ్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ విషాదం 250కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి విషాద దృశ్యాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More