విజయవాడ - గుంతకల్లు, తిరుపతి - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు... తేదీలివిగో

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. విజయవాడ, వికారాబాద్, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Jan 15, 2026, 06:02:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.... ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

విజయవాడ, తిరుపతి, వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
విజయవాడ, తిరుపతి, వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
  • దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... విజయవాడ - గుంతకల్లు మధ్య జనవరి 16వ తేదీన ట్రైన్ ఉంటుంది. రాత్రి 7 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి... మరునాడు తెల్లవారుజామున 4.30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, దోనకొండ, మార్కాపురం, కుంభం, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
  • ఇక మచిలీపట్నం - ధర్మవరం మధ్య జనవరి 16వ తేదీతో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 6 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, పీలేరు, మదనపల్లె, కదిరి స్టేషన్లలో ఆగుతుంది.
  • వికారాబాద్ - నాందేడ్ మధ్య జనవరి 20వ తేదీన స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలు... ఉదయం 11.30 గంటలకు వికారాబాద్ నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 8.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ ట్రైమ్ శంకర్ పల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తుంది.
  • వికారాబాద్ - తిరుపతి మధ్య జనవరి 19వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్... సత్తెనపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More