AP TET In Service Keys : ఏపీ స్పెషల్ టెట్ ప్రాథమిక కీలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

AP TET In Service Keys : ఆంధ్రప్రదేశ్ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్ పరీక్షల ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి.  tet2dsc.apcfss.in పోర్టల్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Published on: Oct 27, 2026, 12:51:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP TET In Service Keys : ఏపీ ప్రత్యేక టెట్(ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు) పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా… తాజాగా ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అధికారిక పోర్టల్‌లో ఉంచారు.

ఏపీ ప్రత్యేక టెట్ కీలు విడుదల
ఏపీ ప్రత్యేక టెట్ కీలు విడుదల

ఈ టెట్ పరీక్షలకు హాజరైన ఉపాధ్యాయులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి సమాధానాల కీని సేకరించవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను ఇటీవల నిర్వహించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీతో పోల్చి చూసుకుని మార్కులను అంచనా వేసుకోవచ్చు.

ప్రాథమిక కీ డౌన్లోడ్ ఎలా..?

  • పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in లేదా aptet.apcfss.in ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న ఏపీ స్పెషల్ టెట్ - 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఆన్సర్ కీపై క్లిక్ చేయాలి.
  • మొత్తం 36 సబ్జెక్టులతో కూడిన ప్రాథమిక కీలు ఉంటాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా వీటిని పొందొచ్చు.

ఇక రెస్పాన్స్ షీట్ కోసం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in లోకి వెళ్లాలి. స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ లింక్ పై క్లిక్ చేయాలి. మీ వివరాలతో లాగిన్ కావాలి. ఇందులో మీ రెస్పాన్స్ షీట్ అందుబాటులో ఉంటుంది.

ప్రాథమిక కీలోని ప్రశ్నలు లేదా సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. సరైన ఆధారాలు మరియు పత్రాలను జతచేసి అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను లేదా ఇతర మార్గాల్లో పంపిన ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. అభ్యంతరాల పరిశీలన అనంతరం నిపుణుల కమిటీ సూచనల మేరకు తుది కీని విడుదల చేస్తారు. ఆపై ఫలితాలను ప్రకటిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More