AP Special TET 2026 Hall Tickets : ఏపీ స్పెషల్ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP Special TET 2026 Hall Tickets : ఏపీ స్పెషల్ టెట్ 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 11 నుంచి ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP Special TET 2026 Hall Tickets : ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ స్పెషల్ టెట్ - 2026)కు సర్వం సిద్ధమైంది. ఈ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని http://cse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టైమింగ్స్ వివరాలు…
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టెట్ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో పకడ్బందీగా నిర్వహించనున్నారు.
- మొదటి సెషన్: ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతుంది.
- రెండో సెషన్: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది.
పరీక్ష సమయపాలన విషయంలో అభ్యర్థులు తీవ్ర జాగ్రత్త వహించాలని అధికారులు స్పష్టం చేశారు. ఆయా సెషన్ల ప్రారంభ సమయానికి కనీసం ఒక గంట ముందే అభ్యర్థులు కేటాయించిన పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా ముందే రావడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ స్పెషల్ టెట్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,420 మంది ఉపాధ్యాయులు ఈ పరీక్ష కోసం 83,015 దరఖాస్తులను సమర్పించారని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకే ఉపాధ్యాయుడు ఒకటికంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేసుకోవడం వల్ల అభ్యర్థుల సంఖ్య కంటే దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.
అభ్యర్థులు ముందుగానే వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లలో ఉన్న కేంద్రం వివరాలు, పరీక్ష తేదీలు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని విద్యాశాఖ కోరింది.
ఏపీ స్పెషల్ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని స్పెషల్ టెట్ టీచర్ లాగిన్ ఆప్షన్ పై నొక్కాలి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

