కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లను జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాపీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం (కాకినాడ జిల్లా నుంచి), మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది.
వీటి విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాలను మరో జిల్లాలకు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటి వివరాలు పరిశీలిస్తే….
- సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది. కడప డివిజన్ పరిధిలో ఉన్న రాజంపేటను కలిపారు.
- కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రెవెన్యూ డివిజన్‌ను మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేశారు.
- కలువోయ మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్చారు.
- సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్పు చేశారు.
- కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు మార్చారు. ఈ 3 మండలాలను రామచంద్రాపురం డివిజన్ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌కు మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు డివిజన్లో కలిపారు.
{{/usCountry}}చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరు డివిజన్లో కలిపారు.
{{/usCountry}}