...
...
Next Story

ఈనెల 20న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - తిరుమలలో పర్యటన..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నవంబర్ 20న తిరుపతికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 21న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

Published on: Nov 7, 2025, 09:11:48 IST
Advertisement

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. తొలుత నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరుమలకు చేరుకుంటారు. నవంబర్ 21వ తేదీన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముర్ము పూజలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ముర్ము
ఏపీ పర్యటనకు రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబరు 21వ తేదీన తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబరు 20న తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారని వివరించింది.

ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబరు 21న రాష్ట్రపతి ముర్ము… ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తరువాత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.0

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి రెండు రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు. పూర్తిస్థాయిలో, సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe