...
...
Next Story

రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం - హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభం

రాష్ట్ర రాజధాని అమరావతిలో కీలక ఘట్టం చోటు చేసుకుది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించిారు.8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉండనుంది.

Published on: Dec 25, 2025, 21:25:06 IST
Advertisement

రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. బీ ప్లస్ జీ ప్లస్ 3 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం జరగనుంది.

మొత్తం 7 భవనాలు - మంత్రి నారాయణ

రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం
రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం

ఈ సందర్భంగా ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని వివరించారు.

"నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈరోజు హై కోర్టు పనులు ప్రారంభించాం. మొత్తం 21 లక్షల చ. అ విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది" అని పురపాలకశాఖ మంత్రి నారాయణ వివరించారు.

మొత్తం 45000 టన్నుల స్టీల్ ను భవనానికి వాడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని విమర్శించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe