ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్ - ఏపీకి వర్ష సూచన, తీరం వెంబడి ఈదురుగాలులు
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం (అక్టోబర్ 17) పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడిగులు పడొచ్చని అంచనా వేసింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. శుక్రవారం (17-10-25) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం… అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించారు.
నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు:
మరోవైపు గురువారం(16 అక్టోబర్ 2025)న నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మే 24న రుతుపవనాలు ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ లోకి మే 26న రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగానూ భారీ వర్షాలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

