అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో ఘాతాతుకానికి పాల్పడిన ఉన్మాది హేమంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర విషమంగా మారింది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడికి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు గాయపడిన హేమంత్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్-రే నివేదికల్లో బుల్లెట్లు ఏవీ లోపల లేవని తేలింది. బుల్లెట్లు కాలు గుండా దూసుకెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. హేమంత్ కుడి కాలుకు తీవ్రమైన గాయమైంది. దీనివల్ల కింది భాగానికి రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయి, ఆ భాగం కుళ్లిపోయే స్థితికి చేరింది.
రక్తప్రసరణ పునరుద్ధరించడం కష్టంగా మారడంతో, నిందితుడి ప్రాణాలు కాపాడేందుకు కుడి కాలును మోకాలు కింది వరకు లేదా సగం భాగం తొలగించాల్సి రావచ్చని సూపరింటెండెంట్ తెలిపారు. అనస్తీషియా వైద్యుడితో పాటు ఆర్థోపెడిక్, వాస్కులర్ సర్జరీ నిపుణులు నిందితుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వైద్య నివేదికలు పరిశీలించిన తర్వాతే శస్త్రచికిత్స ద్వారా కాలు తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది?
రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం రోజున పదో తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై హేమంత్ అనే ఉన్మాది ఒక్కసారిగా రంపంతో అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడితో ఉలిక్కిపడ్డ పాఠశాల సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో గోపిక చికిత్స పొందుతుంది. గోపికను కాపాడేందుకు వచ్చిన మరో బాలిక కాళ్లకి కూడా గాయాలు అయ్యాయి. ఆ పాప కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
దాడి అనంతరం పరారైన నిందితుడి కోసం పోలీసులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో దారుణానికి ఒడిగట్టి పరారైన నిందితుడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్నాడనే పక్కా సమాచారంతో పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. అడవిలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు లొంగిపోకుండా పోలీస్ సిబ్బందిపై తిరగబడి దాడికి యత్నించాడు. హెచ్చరిస్తూ పోలీసులు మొదట గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు హేమంత్ కాళ్లపైకి కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}దాడి అనంతరం పరారైన నిందితుడి కోసం పోలీసులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో దారుణానికి ఒడిగట్టి పరారైన నిందితుడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్నాడనే పక్కా సమాచారంతో పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. అడవిలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు లొంగిపోకుండా పోలీస్ సిబ్బందిపై తిరగబడి దాడికి యత్నించాడు. హెచ్చరిస్తూ పోలీసులు మొదట గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు హేమంత్ కాళ్లపైకి కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}పాఠశాల ప్రాంగణంలోకి ఆయుధంతో చొరబడి పదో తరగతి విద్యార్థినిపై ఈ రీతిలో దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.