ఈనెల 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు - ఒకేరోజు 7 వాహనాలపై శ్రీవారి దర్శనం

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. సప్తవాహనాలపై స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. వాహనసేవల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Jan 17, 2026, 16:47:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ‌న‌వ‌రి 25న‌ తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.అత్యవసర పరిస్థితుల్లో వాహ‌నాల‌ను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించనున్నారు.

తిరుమల
తిరుమల

జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల్లో భాగంగా ఏడు వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం కానున్న రథసప్తమి వేడుకలు, అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. ఈ సందర్భంగా రథసప్తమి రోజు ఏ సమయంలో ఏ వాహనసేవ జరుగుతుందో తెలుసుకోండి…..

వాహనసేవల వివరాలు :

  • తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దవుతాయి. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు ఉండవు. తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని కూడా రద్దు చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More